భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఫేమస్‌గా పేరు పొందిన దర్శకుడు శంకర్‌, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2 అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు అప్పట్లో రికార్డులు బ్రేక్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్స్‌ రాగా.. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ఈ సినిమాలో కలమ్‌ హాసన్‌తో ప్రముఖ టీమిండియా క్రికెటర్‌ తండ్రి ఫైట్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ మేరకు చిత్ర బృందం ఫోటో షేర్‌ చేసింది. ఇదిలావుంటే కమల్‌ హాసన్‌ ఇండియన్-2 సినిమాలో విలన్‌గా యోగ్ రాజ్ సింగ్ నటించబోతున్నారు. ఇక ఈయన ఎవరు అంటే.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి. అయితే ఆయనకు సినిమాలకు కొత్త కాదు.అయితే  ఇప్పటికే పంజాబ్‌లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న యోగ్ రాజ్‌ సింగ్ సౌత్‌ ప్రేక్షకుల ముందుకు రావడం.. అది కూడా కమల్‌ హాసన్‌ పాన్ ఇండియా మూవీలో కనిపించడం మాత్రం ఇదే తొలిసారి.

ఇక ఈ క్రమంలో సినిమాలో తన పాత్ర కోసం మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోని యోగ్ రాజ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇక యోగ్ రాజ్ సింగ్‌ నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇక 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత యువరాజ్ సింగ్ కెరీర్ మసకబారడానికి మహేంద్రసింగ్ ధోనీనే కారణమంటూ ఆరోపణలు చేస్తూ.. తరచూ యోగ్ రాజ్ సింగ్ వార్తల్లో నిలిచేవాడు.ఇకపోతే మేకప్‌ వేసుకుంటున్న ఫోటోతో పాటు.. ఇండియన్-2 సినిమాలో నటిస్తున్నానని ప్రకటించిన యోగ్ రాజ్ సింగ్.. తనని తాను పంజాబ్ సింహంగా పేర్కొన్నాడు.అంతేకాదు అలానే కమల్ హాసన్‌ని లెజెండ్ అంటూ పొగిడేశాడు.ఇక ఈ ఇండియన్‌-2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఇండియన్-2 మూవీథియేటర్లలోకి రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: