తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న ధనుష్ తాజాగా సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగుvలో సార్ అనే పేరుతో విడుదల కాక తమిళ్ లో వేత్తి అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సంయుక్తా మీనన్ ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు ... అటు తమిళ సినీ ప్రేమికులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ఈ మూవీ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడడం తో ఈ సినిమాకు తెలుగు మరియు తమిళ భాషలలో మొదటి రోజు మంచి ఓపెనింగ్ లభించాయి. అలాగే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మంచి కలెక్షన్ లు లభించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి మంచి టాక్ కూడా లభించడంతో ఇప్పటికి కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమా 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది  ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 53.99 కోట్ల షేర్ ...103.86 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా ధనుష్ "సార్" మూవీ తో 100 కోట్ల రెర్ మార్క్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: