తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు విశాల్ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ ... మట్టి కుస్తీ మూవీ లతో తెలుగు సినీ ప్రేమికులను కూడా అలరించాడు. ఈ రెండు మూవీ లు కూడా తెలుగు లో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.

అలాగే విక్రాంత్ కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరు హీరోలు ఇప్పటికే  సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ఇద్దరు హీరోలు లాల్ సలాం అనే మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఈ క్రేజీ మూవీ కి సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వం వహించబోతుంది. ఈ మూవీ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. విష్ణు విశాల్ ... విక్రాంత్ లు ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండడం ... సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించ బోతుండడం ఐశ్వర్య రజనీ కాంత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రేజీ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: