పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో భాగంగా గ్రామీణ సుమంగళ్ పథకం కూడా ఒకటి. ఇందులో కలెక్టర్గా 15 సంవత్సరాలు గరిష్టంగా 20 సంవత్సరాల వరకు ఈ పాలసీ లో చేరవచ్చు.15 సంవత్సరాల కాలపరిమితి ఉండే పాలసీని తీసుకుంటే 6,9,12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 - 20 శాతం తో ఆర్థిక భరోసా లభిస్తుంది. మెచ్యూరిటీ పై 40 శాతం మేర డబ్బులు బోనస్ గా పొందవచ్చు. ఇక అదే 20 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ పాలసీ తీసుకుంటే 8,12,16 సంవత్సరాలలో 20 -20 శాతం డబ్బు తిరిగి పొందవచ్చు. మెచ్యూరిటీ పై 40 శాతం వరకూ బోనస్ కూడా ఉంటుంది.. ఇక ఈ పథకం లో డిపాజిట్ చేసిన ప్రతి వెయ్యి రూపాయలకు 48 రూపాయలు బోనస్ గా అందుతుంది. పాలసీదారుడి వయసు 25 సంవత్సరాలు ఉంటే నెలవారీ ప్రీమియం 2,853 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.ఇరవై వ సంవత్సరంలో తీసుకుంటే ఈ మొత్తం 13.72 లక్షల రూపాయలు లభిస్తాయి..