వైఎస్సార్ కాపు నేస్తం కింద జిల్లాలో అర్హత కలిగి ఉన్న కాపు, ఒంటరి ,బలిజ సామాజికవర్గానికి చెందిన మహిళలు 2021 - 2022 సంవత్సరానికిగాను వైయస్సార్ కాపు నేస్తం కింద, దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ వి ఎస్ సుబ్బలక్ష్మి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. మీ పరిధిలో ఉన్న వాలంటీర్లు ఈ పథకం కోసం సంప్రదించాలని ఆమె సూచించారు ఇక జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ పథకానికి కావలసిన సంబంధిత ధృవ పత్రాలను వాలంటీర్ వద్దకు తీసుకెళ్లి ఈ కేవైసీ చేయించాలని కోరారు.ఇక జులై 24వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.