
తాజాగా ఒక కంపెనీ బోనస్ షేర్లు ప్రకటించింది. ఒక షేర్ కొనుగోలు చేస్తే ఐదు షేర్లను ఉచితంగా ఇవ్వనుంది. అంటే మీ దగ్గర కంపెనీకి చెందిన ఒక షేర్ ఉంటే మీకు ఐదు షేర్లు ఉచితంగా లభిస్తాయి. ఇక అదేదో కాదు పునీత్ కమర్షియల్స్ అనే కంపెనీ. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ.. మార్కెట్ క్యాప్ రూ.1.23 కోట్లు మాత్రమే. కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఇండస్ట్రీలో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా డైమండ్స్ ని తయారు చేసి ఎగుమతి దిగుమతి కూడా చూసుకుంటుంది . ఇకపోతే గత ఆరు నెలల కాలంలో భారీ లాభాలను అందించింది. ప్రస్తుతం బోనస్ షేర్ల ప్రకటనతో కంపెని షేర్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది అని చెప్పవచ్చు.
కంపెనీ పేరు ఇయంత్రా వెంచర్స్ గా కూడా మారనుంది. అయితే ఇతర అప్రూవల్స్ మీద ఈ పేరు మార్పు ఆధారపడి ఉంటుంది. లేకపోతే డిసెంబర్ 3 లేదా దీనికంటే ముందే బోనస్ షేర్లు ఇన్వెస్టర్లకు అందే అవకాశం ఉందని సమాచారం. గత నెల రోజుల్లో భారీగా పెరిగిపోయింది. 126% మేర ర్యాలీ చేసి కంపెనీలో ప్రమోటర్ వాటా 73.74 శాతంగా మారిపోయింది. పబ్లిక్ వాటా 2018లో ఒక షేర్ ధర కేవలం రూ.18.25 మాత్రమే ఉండేది
కానీ దాని విలువ ప్రస్తుతం రూ. 51 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే 170 శాతానికి పైగా రాబడిన అందించింది. కాబట్టి ఇందులో మీరు షేర్స్ కొనుగోలు చేస్తే మీకు మరింత ఆదాయం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.