మ్యూచువల్ ఫండ్స్ కి చెందిన ఈక్విటీ స్కీంలో అధిక రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్స్ మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటాయి. అందువల్ల డబ్బులు పెట్టేవారు రిస్కు ఉంటుందని కూడా గుర్తించుకోవాలి . అయితే దీర్ఘకాలంలో మంచిరాబడి పొందవచ్చు అని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో అదిరే రాబడి అందించిన పలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్.. ఐదేళ్ల రాబడి 26 శాతానికి పైగా పెరిగింది.. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్లో లక్ష రూపాయలు పెట్టి ఉంటే దాని విలువ రూ.3.21 లక్షలు వచ్చేవి . అదే నెలకు రూ.పదివేలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 14 లక్షలకు పైగా లభించేవి. రూ. 330 చొప్పున ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే రూ.14లక్షలు మీ చేతికి వచ్చేవి.
ఎస్బిఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఒకటి. ఐదు సంవత్సరాల రాబడి కి 24 శాతంగా ఉంది అంటే మీరు ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లో లక్ష రూపాయలు పెట్టి ఉంటే దాని విలువ మూడు లక్షలు వచ్చేవి. అదే నెలకు పదివేల చొప్పున పెడుతూ వచ్చి ఉంటే రూ. 13.5 లక్షలు పొందేవారు. ఈ పథకాలలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి