తాజాగా కేంద్ర బ్యాంక్ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు తీసుకొచ్చింది వీటివల్ల బ్యాంకు కష్టమర్స్ కి కూడా ప్రయోజనం కలగబోతోంది. మరి ముఖ్యంగా బ్యాంకు నుంచి పెన్షన్ పొందే పెన్షనర్ల కి కూడా ఆర్.బి.ఐ ఊరట కలిగించే ప్రతిపాదన చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ అంశంపై ముఖ్యమైన సిఫార్సు చేసిన ఆర్బిఐ ఇది అమలులోకి వస్తే చాలామందికి ఊరట కలుగుతుంది అని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది ఆర్.బి.ఐ పర్యవేక్షణలో నడిచే సంస్థలైన బ్యాంకులు ,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు , పేమెంట్ సర్వీసెస్ సెంటర్ల ఆపరేటర్లు.. కస్టమర్లకు సర్వీసులు ఎలా అందిస్తున్నాయో పరిశీలించాలని కూడా ఆర్బిఐ ఒక కమిటీని ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ కమిటీ సిఫార్సులు జారీ చేసింది.

ఆర్.బి.ఐ కమిటీ సిఫార్సు చేసిన తొలి ముఖ్యమైన వాటిల్లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కూడా ఒకటి ఉందని ప్రస్తుతం బ్యాంకుల నుంచి పెన్షన్ పొందేవారు తమ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్లి తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని స్పష్టం చేశారు. ఒకవేళ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్ళలేక పోతే అప్పుడు ఆన్లైన్లో కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సర్వీస్ లను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు.. వీడియో కాల్ ద్వారా పెన్షనర్లు ఈ పని పూర్తి చేయొచ్చు అని కూడా స్పష్టం చేశారు.  ఇకపోతే ఇప్పుడు ఆర్బిఐ కమిటీ మరొక కీలక ప్రతిపాదన చేస్తూ బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ లో అయినా సరే ఈ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే వెసులు బాటు ను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.

ఇకపోతే పెన్షనర్లు వారి పెన్షన్ అకౌంట్ కలిగిన బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ లో అయినా సరే జీవన్ ప్రమాణ పత్రాన్ని సమర్పించే విధంగా సేవలు అందుబాటులోకి ఉంచాలి అని.. అంతేకాకుండా ఏడాదిలో ఏ నెలలో అయినా సరే లైఫ్ సర్టిఫికెట్ ను  అందించే నిబంధనలను కూడా తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఆర్బిఏ చేసిన ఈ కీలక ప్రకటన పెన్షనర్లకు మంచి ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: