చాలా కాలం తర్వాత మన వెంకీమామ– మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రూపుదిద్దుకుంటోందనే వార్త బయటకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. గతంలో ఈ క్రేజీ కాంబోతో వచ్చిన ‘నవ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయంటే కారణం వీళ్ళిద్దరి మ్యాజిక్, టైమింగ్, ఎమోషన్. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసి సినిమా తెరకెక్కిస్తుండటంతో, “ఈ కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ” అని ఇండస్ట్రీ వర్గాలు కూడా ధీమాగా చెప్పుకుంటున్నాయి.


ఇటీవల  ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు వెంకటేష్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో వెంకటేష్ పూర్తిగా ఒక ఫ్యామిలీ మ్యాన్ లా, సాధారణ మనిషిలా కనిపిస్తున్నా… టైటిల్, డిజైన్, కలర్ టోన్—అన్ని చూస్తే సినిమా సింపుల్ ఫ్యామిలీ స్టోరీ కాదన్న సందేహం వెంటనే కలుగుతుంది. టైటిల్ చివర భాగంలో రక్తం కారుతున్నట్టు కనిపించే ఆ చిన్న డీటైల్‌ని గమనించిన అభిమానులు, “త్రివిక్రమ్ ఏదో డీప్ క్రైమ్-థ్రిల్లర్ అంగిల్ ప్లాన్ చేస్తున్నట్లు ఉంది” అని ఊహాగానాలతో నిండిపోతున్నారు. త్రివిక్రమ్ కూడా ఈసారి పూర్తిగా కొత్త జానర్‌కు ట్రై చేస్తుండొచ్చనే సంకేతాలు ఆ పోస్టర్ నుంచే స్పష్టంగా కనిపిస్తున్నాయి.


హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం, వెంకటేష్ కెరీర్‌లో 77వ సినిమాగా రానుండటం ప్రత్యేకత. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలోనే భారీ స్కేల్‌లో ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. 2026 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి.వెంకటేష్‌కి ఉన్న ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్—అన్ని  తెరపై పూర్తి ఎంటర్టైన్మెంట్‌ను అందించేలా త్రివిక్రమ్ కథను రూపొందిస్తున్నారని తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, టెన్షన్, సస్పెన్స్—అన్ని కలిసిపోయేలా ఉండబోతుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే అభిమానులు కూడా ఇదో ఫుల్ మీల్స్ సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి…‘ఆదర్శ కుటుంబం’ అయినా… కథలో దాగి ఉన్న రహస్యాలు మాత్రం వేరే లెవల్‌లో ఉండబోతున్నాయి!త్రివిక్రమ్ ప్లానింగ్‌లో ఉన్న ఆ చిన్న చిన్న డీటైల్స్ చూస్తేనే ఈ సినిమా ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో అర్థమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: