క్రెడిట్ స్కోర్ అనే పదం చాలా మందికి తెలిసిన పదమే అయితే ప్రతి ఒక్కరు కూడా లోన్ తీసుకునే సమయంలో వీటి గురించి చాలా అవగాహన వస్తూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నందువలన కొంతమందికి లోన్లు ఇవ్వకుండా ఉంటారు. అయితే ఈ క్రెడిట్ స్కోర్ ని ఎలా పెంచుకోవాలి అనే అంశాల పైన మాత్రం చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. వాస్తవానికి ఈ సిబిల్ స్కోర్ అనేది కూడా చాలా కీలకమని కూడా చెప్పవచ్చు మనం పర్సనల్ లోన్ హోమ్ లోన్ , ఆటోలోన్,ఇతరత్రా రుణాన్ని సైతం పొందడానికి ఈ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ చాలా అవసరము. అయితే సిబిల్ స్కోర్ బాగా ఉండడానికి మాత్రం మీరు ఇలాంటి తప్పులను చేయకండి.


సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండేది. మనకు లోన్ కావాలి అంటే కచ్చితంగా 750 కంటే ఎక్కువ స్కోరును ఉండాలి.. అప్పుడే రుణం పొందే అవకాశం ఉంటుంది. గతంలో మనం ఏదైనా చెల్లించిన EMI వాటి విషయాలను కూడా వెల్లడిస్తుంది. ఈ స్కోర్ అనేది క్రెడిట్ యొక్క మొత్తం సమాచారాన్ని చూపిస్తుంది.సిబిల్ స్కోర్ సరిగా ఉండాలి అంటే వీటిని ఎప్పటికప్పుడు మనం తనకి చేసుకోవడం మంచిది.


మన సిబిల్ స్కోర్ ను కరెక్ట్ గా ఉంచుకోవాలి అంటే మొదట ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పాత రుణాలు తిరిగి చెల్లింపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. గడువులోపే చెల్లించడం ముఖ్యము.. ఆలస్యం చేయడం వల్ల క్రెడిట్ కార్డు బకాయి చెల్లింపు ఆలస్యం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అయితే మన కార్డు మీద ఎంత రుణాన్ని ఇస్తారో అంత రుణాన్ని తీసుకోకపోవడం మంచిది అందులో 30% తగ్గించి తీసుకుంటే మరింత మంచిదట.

క్రెడిట్ కార్డ్ అనేది ఇల్లు లేదా వాహన రుణం వంటి వాటి మీద తీసుకోవడం వల్ల చాలా సిబిల్ స్కోర్ ను పొందడానికి ఆస్కారం ఉంటుందట.


ఓకే అకౌంట్ మీద చాలా రుణాలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది కాదు. అలా ఒకే కార్డు మీద రెండు మూడు సార్లు అప్లై చేసినట్లు అయితే తనిఖీ చేసినప్పుడు ఇది బయటపడుతుంది దీనివల్ల సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: