కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువగా ప్రజలు చాలా మంది హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా చురుకుగా ఉంటున్నారు. వీటి పైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూపిస్తూ ఉన్నారు..ప్రభుత్వం జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎల్ఐసి సరికొత్త పాలసీని తీసుకువచ్చింది. jeevan dharaa-2 ప్లాన్ పేరుతో పెన్షన్ ప్లాన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్, పొదుపు, వ్యక్తిగత డిఫర్డ్ మాన్యుటి ప్లాన్ అన్నట్లుగా తెలుస్తోంది. జనవరి 22వ తేదీ నుంచి ఈ ఏడాది ఈ పాలసీని ప్రారంభించారు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


జీవన్ ధార -2 పాలసీ పొందేందుకు కనీసం వయసు 20 సంవత్సరాలు అయ్యి ఉండాలి.. ఎజ్ ను బట్టి పాలసీలోకి ప్రవేశించే వారి గరిష్ట సంఖ్య..(65,70,80 సంవత్సరాలు) చేంజ్ అవుతూ ఉంటుంది. జీవన్ ధార -2 పథకాల పూర్తి విషయానికి వస్తే..

1). ఈ పథకంలో చేరితే పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అవుతుందట.


2). ఈ పథకంలో ఒకేసారి డిపాజిట్ చేస్తే ప్రతి నెల కొంత మొత్తం ఆదాయాన్ని మనం పొందవచ్చు.. అయితే దీనిని మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది వరకు చెల్లించుకొని అదుపు సదుపాయం కూడా కలదు.


3). తీసుకొనే ప్రీమియంను బట్టి పాలసీదారుని యొక్క ప్రయోజనాలు ఆ స్థాయిలోనే లభిస్తాయి. ఈ పథకం పూర్తి  5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఏదైనా అవసరమైనప్పుడు కూడా రుణాన్ని సైతం పొందవచ్చు.

4).జీవన్ ధార -2 పాలసీ పైన లోన్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఈ పాలసీదారుడు మరణిస్తే ఏక మొత్తంలో ఒకేసారి పరిహారాన్ని సైతం పొందవచ్చు.


5).జీవన్ ధార -2 పాలసీలో 11 రకాల ఆప్షన్లో సైతం కలిగి ఉంటాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే దగ్గర్లోని ఎల్ఐసి సంస్థ వద్దకు వెళ్లాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: