టాలీవుడ్ యువ నటుడు నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎంసీఏ , వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫాస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా అది సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఆ వివరాల ప్రకారం ... ప్రస్తుతం తమ్ముడు యూనిట్ నితిన్ పై రామోజీ ఫిలిం సిటీ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ చాలా రోజులు జరగనున్నట్లు ఈ ఒక్క ఫైట్ సన్నివేశం కోసమే ఏకంగా ఈ మూవీ యూనిట్ 8 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు ఈ ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండనున్నట్లు నితిన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న యాక్షన్ ఎపిసోడ్ ఇదే అని తెలుస్తుంది.

ఇక ఈ భారీ బడ్జెట్ యక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది అనే వార్తలు రావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. మరి తమ్ముడు సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ఈ మూవీ తో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ కూడా వేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: