పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు.. శంకర్ పాత్రకు తాను తప్ప మరెవరు సరిపోరు అన్న రేంజ్ లో రామ్ నటించాడు.. నభా నటేష్ లాంటి హీరోయిన్ టాలెంట్ ఇండస్ట్రీ కి దొరికింది.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రామ్ ప్రస్తుతం రెడ్ అనే సినిమా లో నటిస్తున్నాడు..ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై రామ్ మంచి అంచనాలే పెట్టుకున్నాడు.వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కాగ గత రెండు చిత్రాలు హిట్ అవడంతో ఈ చిత్రం తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చుస్తునారు.. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే తదుపరి సినిమాపై ఎలాంటి అనౌన్స్ రాలేదు..