ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఆల్రెడీ బిందాస్ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక మిర్చి సినిమా కథ కూడా సేమ్ ఉండడంతో, ఓకే బ్యానర్లో ఒకే కథను రెండు సినిమాలు గా తీయడానికి ఇష్టం లేక మిర్చి సినిమా ను రిజెక్ట్ చేశాడు అనిల్ సుంకర. ఆ తర్వాత ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ వారు నిర్మాతలుగా మారి,ఈ చిత్రాన్ని ప్రభాస్ తో నిర్మించారు. ఫలితంగా ఆశించిన లాభాల కంటే రెండింతల లాభాలు అందుకున్నారు.