యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. ఎప్పుడూ ఏదో ఓ షోలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఈవెంట్స్, షోస్ అంటూ బిజీగా ఉండే టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఇటూ టీవీ షోలతోపాటు సినిమాల్లో కూడా నటించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చిన విషయం అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది.