2002 వ సంవత్సరం అది. విశాఖలో ఓ షూటింగ్లో ఉన్నాను. అది నా రెండో సినిమా షాట్ గ్యాప్లో టచ్ అప్ చేసుకుంటూ ఉంటే ఓ వ్యక్తి వచ్చి "ఈ సినిమా హీరో ఎవరండీ" అని అడిగాడు. నేను చెబితే జరిగిన అవమానమే నాకు బాగా తెలుసు కాబట్టి.. అక్కడ హ్యాండ్సమ్ గా కనిపించే 'సుదీప్' అనే నటుడిని చూపించాను. ఆ వ్యక్తి వెళ్లి సుదీప్ ని ఏం అడిగాడో తెలియదు. కానీ అతను నా వైపు వేలు చూపించాడు. అంతే ఆ వ్యక్తి పక్కనే ఉన్న జనాల మధ్య కెళ్ళి. చూడండ్రా... వాడు హీరో నట! మన ఊరి రిక్షావాలా ఇంతకన్నా బాగా ఉంటారని సరిగ్గా అక్కడున్న వాళ్ళందరూ గొల్లుమన్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. లోపలకి వెళ్లి బోరున ఏడ్చేశాను.