పొలిటికల్ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి అన్నీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్లు నిండిపోయాయి.