పండుగ రేస్ కు జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ రెడీ అంటూ ఈసినిమా రిలీజ్ పోస్టర్లు విడుదల కావడంతో నందమూరి వార్ కు కౌంట్ డౌన్ మొదలై పోయింది. అయితే ఒకవైపు ఈసినిమా విడుదల పై క్లారిటీ వచ్చేసినా మరో నెగిటివ్ ప్రచారం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పై ప్రారంభం కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
జూనియర్ ఇప్పటికి 25 సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించినా జూనియర్ నటించిన సినిమాల టైటిల్స్ లో ‘న’ అక్షరం టైటిల్ తో మొదలైన జూనియర్ సినిమాలు అన్నీ ఘోరమైన ఫ్లాపులుగా మారాయని మరో కొత్త నెగిటివ్ ప్రచారాన్ని జూనియర్ వ్యతిరేకులు తెర పైకి తీసుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
జూనియర్ గతంలో నటించిన ‘నిన్ను చూడాలని’, ‘నాగ’, ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’ సినిమాలు గతంలో ఘోరమైన ఫ్లాపులుగా మిగిలిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ సంక్రాంతికి రాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను కూడ వెంటాడుతుంది అన్న నెగిటివ్ కామెంట్స్ ప్రచారం ఊపు అందుకోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్ల మానసిక ధైర్యాన్ని బెదరగొట్టడానికి ఈ నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి.
దీనికితోడు ఈసినిమాకు రచయితగా పనిచేసిన కోన వెంకట్ ఫ్లాప్ ల సెంటిమెంట్ కూడ ‘నాన్నకు ప్రేమతో’ ను వెంటాడు తోంది. అయితే ఎన్ని నెగిటివ్ ప్రచారాలు జరిగినా ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో సూపర్ హిట్ కావడం జూనియర్ పాడిన ‘ఫాలో ఫాలో’ పాట చాలమంది సెల్ ఫోన్స్ కు రింగ్ టోన్ గా మారడంతో ఈ నెగిటివ్ సెంటిమెంట్లు ఏమి జూనియర్ సినిమాకు చెడు చేయలేవని ఈసినిమా బయ్యర్లు కొండంత ఆశ పై ఉన్నారు..