టాప్ యంగ్ హీరోల పట్ల మ్యానియా ఏస్థాయిలో ఉందో తెలియచేసే ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వినాయకచవితి వచ్చింది అంటే చాలు ప్రతి సెంటర్ లోను వినాయకుడు మండపం లేకుండా మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఊరు కనిపిస్తూనే ఉంటుంది. 

గతంలో ‘బాహుబలి’ మ్యానియాతో ‘బాహుబలి’ వినాయకుడులను చూసిన సందర్భాలు తెలిసిందే. ఈ సందర్భంలో అల్లుఅర్జున్ అభిమానులు తాము కూడ ఏమి తక్కువ కాదు అంటూ ఈసారి వినాయక చవితికి ‘దువ్వాడ జగన్నాథమ్’ గెటప్ లో ఉన్న బన్నీ వొడిలో వినాయకుడును కూర్చోపెట్టి సభ్యసమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇస్తున్నారు. 

అయితే ఆశ్చర్యకరంగా ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీని కొనుక్కున్న బయ్యర్లు చాలామంది నష్టపోవడంతో బాధగా వినాయకచవితిని జరుపుకుంటే బన్నీ అభిమానులు మాత్రం ఆ ఫెయిల్యూర్ ను లెక్క చేయకుండా ఏకంగా ‘డిజే’ ని వినాయకుడుతో సమానంగా పూజిస్తున్నారు. ఈ మండపాలను చూసి ఆధ్యాత్మిక వాదులు మాత్రం షాక్ అవుతున్నారు. 

‘దువ్వాడ జగన్నాథమ్’ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోయినా బన్నీ అభిమానుల దృష్టిలో మాత్రం ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా ఎలా వారిమనసులో రికార్డ్ అయిందో ఈ మండపాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మండపాలకు సంబంధించిన ఫోటోలు సోషల్  మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో ఈ మండపం ఫోటోలతో బన్నీ అభిమానులు తెగ సందడి చేస్తన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: