-
Amarnath Cave Temple
-
annapurna
-
Audience
-
Audio
-
Chiranjeevi
-
Cinema
-
Dadasaheb Phalke
-
dasari narayana rao
-
Devadasu
-
Devadasu 1
-
February
-
Government
-
Heroine
-
Interview
-
June
-
krishna
-
Madhya Pradesh - Bhopal
-
Mass
-
Nagarjuna Akkineni
-
nageshwara rao akkineni
-
nithya new
-
Rajani kanth
-
Romantic
-
september
-
Telugu
-
Tollywood
-
Writer
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది తెలుగువారిలో అక్కినేని ని ఎరుగని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రజలు సినిమాలను ఎంతగా ఆదరిస్తారో అక్కినేని ని కూడా అలాగే ఆరాధిస్తారు. నట సామ్రాట్ గా తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న అక్కినేని నాగేశ్వరరావు గత 72 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో హీరోగా పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ రియల్ లైఫ్ హీరోగా మారిన ఖ్యాతి ఒక్క అక్కినేనికి తప్పించి టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కలేదు. ఇంత సుధీర్గ కాలం ప్రేక్షకులకు బోరు అనేది అనిపించకుండా అటు క్లాస్ ఇటు మాస్ లను తనదైన విలక్షణ నటనతో కట్టిపడేయ్యగలిగిన ఖ్యాతి ఒక్క అక్కినేని నాగేశ్వరరావు కే సొంతం. సాంఘికం, పౌరాణికం, లవ్, రొమాంటిక్...ఇలా ఎన్నో పాత్రలు ఈయన నటించిన 255 చిత్రాలలో పోషించి పద్మవిభూషణుడిగా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత గా అక్కినేని ని దక్షిణ భారతదేశంలో ఏ నటుడు అందుకోలేని హిమాయల శిఖరంపై ఆయన కీర్తీప్రతిష్టలు కూర్చోపెట్టాయి.
1924 సెప్టెంబర్ 20 వ తారీఖున కృష్ణ జిల్లా గుడివాడ దగ్గర ఉండే రామాపురం లో అక్కినేని జన్మించారు. అక్కినేని నటించిన మొదటి సినిమా ‘ధర్మపత్నీ’ అయినప్పటికీ ఆయన కెరియర్ ‘సీతారామ జననం’ సినిమాతో మొదలు అయింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటించిన అక్కినేని ‘శ్రీ రామరాజ్యం’ చిత్రంలో వాల్మికి గా నటించడం యాదృచ్చిక౦ అనుకోవాలి. 255 సినిమాలను తన సుదీర్ఘ కెరియర్ లో నటించిన అక్కినేని సినిమాలలో దాదాపు 30 సినిమాలు రాష్ట్రం యావత్తూ 175 రోజులు ప్రదర్శింపబడి ఏ హీరోకీ లేని అరుదైన రజతోత్సవ రికార్డులను సొంతం చేసుకున్నాడు అక్కినేని. ఆ రోజులలో అంటే 1948 ఫిబ్రవరి 26 న విడుదల అయిన ‘బాలరాజు’ సినిమా విజయవాడ లో 428 రోజులు ప్రధర్శింపబడి ఇప్పటికీ ఒక రికార్డు గా మిగిలిపోయింది. ఆక్కినేని నటించిన మొట్టమొదటి శతదినోత్సవ సినిమా ‘ముగ్గురు మరాఠీలు’.
అక్కినేని మొట్టమొదటి సారిగా ‘నవరాత్రి’ సినిమాలో 9 పాత్రలు పోషించి ఆ రోజులలోనే టాలీవుడ్ లో 9 పాత్రలు పోషించిన ఏకైక నటుడిగా తెలుగు సినిమా రంగంలో ఒక రికార్డు ను క్రియేట్ చేసుకున్నారు. 1953 వ సంవత్సరం జూన్ 26 వ తారీఖున విడుదల అయిన ‘దేవదాసు’ సినిమా అక్కినేని ని మహానటుడు స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రముఖ నవలా రచయిత శరత్ రాసిన దేవదాసు కధను భారతదేశంలోని చాలా భాషలలో తీసినా తెలుగు దేవదాసు కు వచ్చినంత ఖ్యాతి మరే దేవదాసు సినిమాకు దక్కలేదు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో అక్కినేని అన్నట్లుగా, తెలుగులో దేవదాసు లాంటి పాత్రను పోషించిన ఏకైక హీరోగా అక్కినేని మిగిలిపోతాడు అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యలో 1970 ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ ఈ దేవదాసు పాత్రను పోషించి ప్రయోగం చేసినా అక్కినేని దేవదాసు ముందు ఆ సినిమా కనీస మార్కులు కూడా వేయి౦చుకోలేకపొయింది.
తెలుగు సినిమాలలో స్పీడ్ గా స్టెప్స్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది అక్కినేని అని అంటారు. అక్కినేని హీరోగా నటించిన ‘దసరా బుల్లోడు’ సినిమా నుండి హీరోలు స్పీడ్ గా డాన్సులు వేసే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత వచ్చిన ‘ప్రేమ్ నగర్’ నుండి ‘ప్రేమాభిషేకం’ వరకు భగ్న ప్రేమికుడిగా ఎన్నో పాత్రలు పోషించీ మెప్పించిన ఖ్యాతి అక్కినేనిది. దక్షిణ భారత సినిమా రంగంలో మొట్టమొదటిగా ఆడియో గోల్డెన్ డిస్క్ ఘనత పొందినది కూడా అక్కినేని నటించిన ‘ప్రేమాభిషేకం’ సినిమాకే దక్కుతుంది. ఈ సినిమా పాటల క్యాసెట్ లు ఆరోజులలో 50,000 యూనిట్స్ అమ్ముడి పోవడం టాలీవుడ్ రికార్డుగా చెపుతారు. మహాకవి కాళిదాసు పాత్రను మరిపించేలా దాసరి నారాయణ రావు నిర్మించిన ‘మేఘ సందేశం’ సినిమాలో అక్కినేని చూపించిన అద్వితీయ నటనకు ఆయనకు జాతీయ అవార్డు వస్తుంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఆయనకు ఆ అవార్డు రాకపోయినా అక్కినేని ని వరించిన సత్కారాలు, గౌరవాలు, అవార్డులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిలోకి అతి ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే కాళిదాసు సన్మాన్ అవార్డును పేర్కొనాలి. తెలుగు నటుడుగా ఖ్యాతికెక్కిన అక్కినేనిని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం ఒక అరుదైన విషయం. అక్కినేనికి లభించిన అవార్డులు, ప్రశంసా పత్రాలు, మెమెంటోలు వేల సంఖ్యలో ఉండే శాలువాలతో అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున తమ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక మ్యూజియం కింద ఏర్పాటు చేసి ఆ జ్ఞాపకాలను భధ్రపరచాడట. అక్కినేని కి తోచనప్పుడల్లా ఆ అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఆ ఫ్లోర్ దగ్గరకు వెళ్లి మ్యూజియం లా మారిపోయిన తన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటాను అంటారు మన నట సామ్రాట్.
నేటి తో 90 వ పడిలోకి అడుగుపెడుతున్న అక్కినేని తన ఆరోగ్యం విషయంలో కూడా చాలా అదృష్టవంతుడు అనే అనుకోవాలి. 90 సంవత్సరాలు వచ్చినా కనీసం గొంతుకలో కూడా జీర లేకుండా ఎవరి సహాయం లేకుండా నడుస్తూ, ఖంగు ఖంగు మనే గొంతుకతో తనకు మనుమరాళ్ళ వయసులో ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ పై రొమాంటిక్ సెటైర్లు వెయ్యగల సమర్ధత మన టాలీవుడ్ లో అక్కినేనికి తప్ప మరి ఎవ్వరికీ లభించని అదృష్టం. మరొక 100 సంవత్సరాలు గతించిపోయినా, తెలుగు సినిమాలు బ్రతికిఉన్నంత కాలం అక్కినేని నటించిన ‘దేవదాసు’ సినిమాను చూసే ప్రేక్షకులు ఎప్పటికీ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశ సినిమారంగం వందేళ్ళ పండుగను జరుపుకుంటున్న సందర్భంలో అక్కినేని తన 90 వ పుట్టినరోజును ఈరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం ఆయన కీర్తికి కలికితురాయి. దేవుడిని నమ్మని అక్కినేని మహా భక్తుల వేషాలలో చిరస్మరణీయమైన పాత్రలు చేయడమే కాకుండా తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం అక్కినేని కీర్తి చిరంజీవి గానే మిగిలిపోతుంది అని భావిస్తూ ఆ నట సామ్రాట్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు హృదయం నిండైన మనసు తో అభినందనలు అందజేస్తుంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి