నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో పాత్రలు వేశారు.  ఎన్నో రకాల లుక్స్ లో కనిపించారు. కానీ మొదటి సారిగా ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.  మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం కొత్త సినిమాలో నటిస్తున్నారు.  తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జైసింహా మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఇటీవల ఆయన తన తండ్రి జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీశారు.  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మూవీస్.  కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న సినిమాకు  సి కళ్యాణ్  నిర్మాత  వ్యవహరిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.  బాలయ్యని ఈ మూవీలో సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ లో బాలయ్య వయసు 20 ఏళ్ళు తగ్గిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  ఆ మద్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాలో కొత్త దనంగా చూపించడమే కాదు మాస్ యాక్షన్ తో దుమ్మురేపాడు.  

బాలయ్య సరసన ఈ మూవీ హాట్ బ్యూటీలు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి లుక్ లో బాలయ్యను ఎప్పుడూ చూడలేదని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.  ఇప్పటి వరకు రాజకీయల్లో సతమతమవుతున్న బాలయ్య కొత్త లుక్ కొత్త మూవీతో ఎంతో వరకు హిట్ సాధిస్తాడో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: