కోలీవుడ్ స్టార్
హీరో, ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం విజిల్. కోలీవుడ్‌లో
బిగిల్ పేరుతో రు.180 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కిన ఈ సినిమాకు
అట్లీ దర్శకత్వం వహించారు. విజయ్ మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఏఆర్.రెహ్మన్ మ్యూజిక్ అందించారు.
ఇక తెలుగులో ఈ సినిమాను ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌పై మహేష్ ఎస్ కోనేరు రిలీజ్ చేశారు. రు. 10 కోట్లకు ఈ
సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇక తొలి రోజు మాస్‌కు ఈ
సినిమా బాగా కనెక్ట్ అయినట్టు టాక్ రావడంతో బీ, సీ సెంటర్లలో
విజిల్ విజిల్ మోగించేసింది. నాలుగు రోజులకే రు 7.75 కోట్లు అంటే దాదాపుగా రు. 8 కోట్ల షేర్ రాబట్టిన
విజిల్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేయనుంది.
ఇక వరల్డ్ వైడ్‌గా
విజిల్ కు రు.135 కోట్ల ప్రి రిలీజ్
బిజినెస్ జరిగింది. ఇక రెండు రోజులకే వరల్డ్ వైడ్‌గా ఈ
సినిమా రు.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మరి లాంగ్ రన్‌లో విజయ్ విజిల్‌తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో ? చూడాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పోటీగా మరో
కోలీవుడ్ హీరో కార్తి నటించిన
ఖైదీ సినిమా వచ్చినా కూడా
విజిల్ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
విజిల్ 4 రోజుల
ఏపీ,
తెలంగాణ వసూళ్లు ఇలా ఉన్నాయి.
విజిల్ 4 డేస్
ఏపీ,
తెలంగాణ వసూళ్లు ఇలా ఉన్నాయి... (రూ.కోట్లలో) :
నైజాం - 2.35
సీడెడ్ - 2.05
వైజాగ్ - 0.78
గుంటూరు - 0.87
ఈస్ట్ - 0.50
వెస్ట్ - 0.36
కృష్ణా - 0.50
నెల్లూరు - 0.34
-------------------------------
-------------------------------