సెంటిమెంట్ ప్రధాన అంశంగా ప్రభావితంచేసే ఫిలిం ఇండస్ట్రీలో అనేక నమ్మకాలకు సంబంధించిన వార్తలు ఇప్పటివరకు అనేక సార్లు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆశ్చర్యంగా పూరీకి ఒక వంటమనిషి సెంటిమెంట్ ను పెట్టుకోవడం వింతగా మారింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సస్ తో మంచి జోష్ లో ఉన్న పూరీ ఇదే ఆనందంలో తన కొడుకు
ఆకాష్ ను సక్సస్ ఫుల్ హీరోగా చేయాలని మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఆకాష్ నటించిన మొదటి
సినిమా ‘మెహబూబా’ ఫెయిల్ అవ్వడంతో పూరీకి కోట్లల్లో నష్టాలు వచ్చాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ ఆనందంతో
ఆకాష్ ను హీరోగా చేసి ‘రొమాంటిక్’
మూవీ చిత్రీకరణ పరుగులు తీయిస్తున్నాడు. ఈచిత్రానికి
పూరి శిష్యుడు అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
పూరి స్వయంగా స్క్రిప్టును అందించి నిర్మిస్తున్న ఈమూవీతో
ఆకాష్ కెరియర్ చక్కబడటానికి పూరీ ఒక వంటమనిషి సెంటిమెంట్ ను కూడ వాడుకుంటున్నాడు.
ఈ మూవీకి సంబంధించి
గోవా షెడ్యూల్ ని
ప్లాన్ చేరు. గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సంబంధించిన చాల సీన్స్ చిత్రీకరించిన
గోవా ప్రాంతంలోని ఈ
మూవీ షూటింగ్ ను కూడ
ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం గోవాలో
పూరి టీమ్ కి వంట వండి పెట్టిన ఒక తెలుగావిడ ఉన్నారట. ఆమె వంట ఎనర్జీనిచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సస్ కి కలిసి వచ్చింది అని
పూరి నమ్మకం అని తెలుస్తోంది.
అందుకే మరోసారి
పూరి అక్కడికే వెళ్ళి ఆమె వంట రుచి చూస్తూ ‘రొమాంటిక్’ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు తీయబోతున్నట్లు టాక్.
పూరి జగన్నాథ్ సెంటిమెంట్ ప్రకారం
ఆకాష్ మూవీ హిట్ అయితే ఇక రానున్న రోజులలో చాల మంది నిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను గోవాలో తీస్తూ ఆ వంటావిడ వండిపెట్టే రుచులను ఎంజాయ్ చేస్తూ సినిమాలు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..