టాలీవుడ్ హాస్యనటి హేమ వ్యవహారం తరువాత మరొక హీరోయిన్ ఎస్ఎమ్ఎస్ ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన సెల్‌ఫోన్ కు గత కొంతకాలంగా అశ్లీల SMS లు పంపుతున్న వ్యక్తిని తెలుగు హీరోయిన్ మధురిమ పట్టుకుంది. అతనెవరో కాదు ఆమె మాజీ మేనేజరే కావటంతో షాక్ కు గురైంది. తనపై దుష్ర్పచారం చేస్తున్న వ్యక్తి తనమాజీ మేనేజరే అని తెలుసుకుని మధురిమ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పనులు ఆగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చిందట.
తాజాగా నటి మధురిమపై ఆమె మాజీ మేనేజర్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిసి ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చాలా మందికి ఆ మేనేజర్ పరిచయo ఉన్న వ్యక్తే అని అంటున్నారు. తన మాజీ మనేజర్ అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపించడంతో పాటు తనను, పలువురు చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల నుంచి తొలగించారన్న దుష్ర్పచారం చేస్తున్నాడని మధురిమ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే తన దర్శక నిర్మాతలు ఎవరూ అతని మాటలు నమ్మలేదు అని చెపుతోంది.
‘ఆ..ఒక్కడు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మధురిమ ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సరదాగా కాసేపు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘మహంకాళి', వెంకటేష్ హీరోగా వచ్చిన ‘షాడో' చిత్రంలో శ్రీకాంత్ సరసన అవకాశం దక్కించుకున్నా ఆ సినిమాలు ఏవీ పెద్దగా విజయవంతం కాకపోవడంతో మధురిమ ఐరన్ లెగ్ బ్యూటీ గా ముద్ర పడింది. మంచి నటిగా పేరు తెచ్చుకుందామని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏవీ కలిసి రాకపోవడంతో ప్రస్తుతం మధురిమ కెరియర్ అగమ్యగోచరంగా మారింది అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి