సాధారణంగా తమిళ మీడియా తెలుగు సినిమాల గురించి పాజిటివ్ గా వార్తలు రాయదు. అయితే దీనికి భిన్నంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి తమిళంలో మాటలు రాస్తున్న మదన్ కార్కీ తో ఒక ఇంటర్వ్యూను ఈమధ్య ఒక తమిళ పత్రిక చాల ప్రముఖంగా ప్రచురించింది. 'బాహుబలి' కి తమిళంలో మాటలు వ్రాయడమే కాకుండా ఆ మూవీలో సంచనలనం క్రియేట్ చేసిన కాలకేయుల కోసం ‘కిలికి’ అనే భాషను సృష్టించిన వ్యక్తి మదన్ కార్కీ.

 

ఈ మధ్యనే జరిగిన ప్రపంచ భాష దినోత్సవ సందర్భంగా తాను సృష్టించిన కిలికి భాషకు మరింత ప్రాచుర్యం కలిగించాలి అన్న ఉద్దేశ్యంతో మదన్ కార్కీ ఒక వెబ్ సైట్ ను కూడ ప్రారంభించాడు. ఇలాంటి పరిస్థితులలో ఈరచయిత తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని కొన్ని కీలక ఘట్టాల గురించి లీకులు ఇచ్చాడు.  

 

'ఆర్ ఆర్ ఆర్' లో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్ రామ్ చరణ్‌ల పాత్రల్ని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడని చెపుతూ వారి పాత్రలు ఒక పాత్రను మించి ఇంకోటి ఉంటుందని లీకులు ఇస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమాలకు ఆయువు పట్టు అయిన ఎమోషన్ సీన్స్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో పతాక స్థాయిలో ఉంటాయని ఆ ఎమోషన్స్ ‘బాహుబలి’ స్థాయికి మించి ఉండేలా రాజమౌళి తీసుకున్న జాగ్రత్తలను వివరించాడు. 

 

అంతేకాదు 'బాహుబలి' లాగే ఈ సినిమా కూడా అందరికీ కనెక్ట్ అవ్వడానికి రాజమౌళి వ్యూహాత్మకంగా అందరికీ భావోద్వేగాన్ని కలిగించే స్వాతంత్ర ఉద్యమ నేపద్యం ఈ మూవీలో ఉండటంతో సగటు ప్రేక్షకుడు వెంటనే భావోద్వేగానికి గురి అవుతాడు అంటూ కామెంట్స్ చేసాడు. ప్రేక్షకుల అంచనాలు ‘ఆర్ ఆర్ ఆర్’ పై విపరీతంగా ఉండటంతో ఈ మూవీ తీస్తున్న రాజమౌళి ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడిలో ఉన్నాడో తనకు స్వయంగా తెలుసు అంటూ మదన్ కార్కీ ఇచ్చిన ఇంటర్వ్యూ తమిళ మీడియాలో సంచలన వార్తగా మారింది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: