ఒక మంచి సినిమా తీస్తే జనం చూస్తారు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకుని ‘జాను’ మూవీని నిర్మించిన దిల్ రాజ్ అంచనాలు తారుమారు కావడంతో ఆ మూవీ ఘోర పరాజయంతో దిల్ రాజ్ కు కోట్లలో నష్టాలు వచ్చాయి అన్న వార్తలు ఉన్నాయి. దీనితో ఈ నష్టాలను పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ద్వారా పూడ్చుకుందామని పవన్ చెప్పిన అన్ని కండిషన్స్ కు ఓకె చెప్పి పవన్ షూటింగ్ స్పాట్ లో కొద్ది గంటలు ఉన్నా చాలు అంటూ ఏదోవిధంగా పూర్తి చేసి ‘వకీల్ సాబ్’ ను మే నెలలో విడుదల చేయడానికి దిల్ రాజ్ ఎన్నోప్రయత్నాలు చేసాడు.


ఈమధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీ సంస్థలు ఎన్నికలు ప్రకటించడంతో పవన్ తిరిగి ప్రచారంలోకి వెళ్ళిపోతే తన మూవీ షూటింగ్ పరిస్థితి ఏమిటి అంటూ దిల్ రాజ్ టెన్షన్ పడ్డాడు. అయితే నిన్న ఉదయం పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి అని తెలిసి ఇక ‘వకీల్ సాబ్’ విడుదలకు ఇక సమస్య లేదు అని భావిస్తున్న పరిస్థితులలో సాయంత్రానికి సీన్ రివర్స్ అయి ‘మా’ సంస్థ షూటింగ్ లు అన్నీ నిలుపుదల చేయమని ప్రకటన ఇవ్వడంతో ఇక అనుకున్న విధంగా ‘వకీల్ సాబ్’ మేలో విడుదల అవ్వడం కష్టం అన్న వాస్తవం దిల్ రాజ్ కు పూర్తిగా అర్ధం అయి ఉంటుంది. 


పేరుకు మా సంస్థ ఈ సినిమా షూటింగ్ లను రద్దు చేయడం కరోనా సమస్య ముగిసే వరకు అని చెపుతున్నా ప్రపంచానికే ఈ సమస్య ఎప్పుడు ముగింపు పలుకుతుందో తెలియని పరిస్థితులలో సినిమాల షూటింగ్ ల ప్రారంభం మరింత ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు. దీనితో ‘వకీల్ సాబ్’ మూవీకి ఏర్పడ్డ క్రేజ్ ను సమ్మర్ బిజినెస్ కు జత చేసి మంచి ఫ్యాన్సీ రెట్లకు అమ్మాలి అని ప్రయత్నిస్తున్న దిల్ రాజ్ ఆలోచనలకు విఘాతం కలిగినట్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: