విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా చెలామణీ అవుతున్నాడు. చేసింది తక్కువ సినిమాలు అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా విజయ్ తన ప్రస్థానం మొదలు పెట్టాడు. పెళ్లి చూపులు అనే సినిమా ద్వారా హీరో గా పరిచయమయ్యాడు. ఇందులో  విజయ్ చేసిన యాక్టింగ్ కి యూత్ ఫిదా అయ్యారు అనే  చెప్పాలి. ఇందులో రీతూ వర్మ పక్కన జోడి కట్టాడు. ఈ జోడి అందర్నీ ఆకట్టుకున్నారు. అంత బాగా నటించారు.

 

విజయ్ కెరీర్ లో మరి మైలురాయి అంటే అర్జున్ రెడ్డి.. అర్జున్ రెడ్డి తర్వాత అంతకు ముందు  అని చెప్పుకోవచ్చు. అంత బాగా హిట్ అయింది. ఇందులో  విజయ్ చేసిన యాక్టింగ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచుకున్నాడు. ప్రేమిస్తే ఇలాంటి వాడిని ప్రేమించాలి అని ఈ సినిమా ద్వారా చెప్పాడు. ఈ సినిమాలో ప్రీతితో చేసిన రొమాన్స్ అదేనండి హీరోయిన్  షాలిని పాండే  తో చేసిన రొమాన్స్ మంచి క్లిక్ అయ్యింది. ఈ సినిమా ద్వారా విజయ్ రేంజ్ పెరిగిపోయింది అనే చెప్పాలి. బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది అర్జునరెడ్డి .

 

విజయ్ కెరీర్ మరో బిగ్గెస్ట్ చిత్రం ఏది అంటే గీత గోవిందం. ఈ సినిమా ద్వారా 100  కోట్ల క్లబ్ లో విజయ్ చేరాడు. ఈ సినిమాలో రష్మిక మందాన తో జోడి కట్టాడు. వీరి ఇద్దరి జోడికి మంచి గుర్తింపు వచ్చింది, ఈ సినిమాలో విజయ్ అమాయకుడిగా, రష్మిక  గడుసు పిల్లగా  నటించి అందరి మనసులు దోచేశారు. తర్వాత వీరిద్దరి కాంబినేషనల్  వచ్చిన డియర్ కామ్రేడ్  కి కూడా మంచి మార్కులుపడ్డాయి. ఏది ఏమైనా విజయ్ తన నటన తో, తన ప్రవర్తనతో అమ్మాయిలలో  మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అనే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: