జూనియర్ చరణ్ లమధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నా మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య కొన్ని దశాబ్దాలుగ కొనసాగుతున్న గ్యాప్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై పరోక్షంగా నెగిటివ్ ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందా అన్నభయం కొత్తగా రాజమౌళికి ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళికి ఇలాంటి భయం ఏర్పడటానికి ఒక ఆసక్తికర కారణం ఉంది అనిఅంటున్నారు.

 

చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన భీమ్ పర్ రామరాజు  వీడియోకి వచ్చిన స్పందన ఒకవిధంగా రాజమౌళికి ఇలాంటి అనుమానాలను సృష్టిస్తున్నట్లు టాక్. అల్లూరి పాత్రను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ బర్త్ డే వీడియోకు వచ్చిన స్పందనలో చరణ్ కు మించిన ప్రశంసలు జూనియర్ కు వచ్చాయి. ఈవీడియోకు విజువల్స్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆవీడియో స్థాయిని పెంచింది అని తారక్ అభిమానులు ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. 


మలయాళంలో మినహా తెలుగు హిందీ తమిళం కన్నడంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోనే చరణ్ బర్త్ డే వీడియో వచ్చిన విషయం తెలిసిందే. దీనితో ఈవీడియో అన్ని భాషలలోను ఆవిధంగా క్లిక్ కావడానికి  ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కీలకంగా సహకరించిందని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో ఇతర భాషల్లో కూడ డబ్బింగ్ చెప్పడం చాలా అరుదైన విషయం అంటూ తారక్ అభిమానులు జూనియర్ ను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. దీనితో చరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పి మెప్పించాడు కనుక ఎన్టీఆర్ బర్త్ డే కు చరణ్ వాయిస్ ఓవర్ తో భీమ్ పాత్రను పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈబాధ్యత రాజమౌళి పై పడింది. మేలో వచ్చే జూనియర్ పుట్టినరోజునాడు విడుదల కాబోయే ఆవీడియో కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


వాస్తవానికి చరణ్ తెలుగు వరకు ఓకే కాని ఇతర భాషల్లో మాత్రం వాయిస్ ఓవర్ చెప్పే స్థాయిలో లేడు అన్న అభిప్రాయాలను కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు డైలాగ్ డెలవరీలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని అది ఏ భాషలో అయినా ఎన్టీఆర్ తన డైలాగ్ డెలవరీతో మెప్పించగలడు అంటూ జూనియర్ అభిమానులు చరణ్ అభిమానులను రెచ్చగొడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ కూడ ఎన్టీఆర్ మాదిరిగానే తన వాయస్ ఓవర్ ఇవ్వగలదని వాదిస్తున్నారు. ఇప్పుడు మెగా నందమూరి అభిమానుల మధ్య జరుగుతున్న ఈఇగో వార్ కామెంట్స్ రాజమౌళి దృష్టికి రావడంతో జూనియర్  కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన వీడియోను ఎలా ప్రజెంట్ చేయాలి దానికి సంబంధించి చరణ్ వాయస్ ఓవర్ గంభీరంగా ఉంటూ అన్ని భాషలల్లోను రామ్ చరణ్ చేత చెప్పించే విధంగా జక్కన్న ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఇప్పుడిప్పుడే మొదలైన జూనియర్ చరణ్ ల అభిమానుల ఇజ్ వార్ కు ముందుగానే చెక్ పెట్టాలని కరోన వల్ల వచ్చిన షూటింగ్ గ్యాప్ మధ్య చాల లోతుగా ఆలోచిస్తున్నట్లు టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: