నటసింహం నందమూరి బాలకృష్ణ, నవ్వుల రారాణి రోజా కలసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. భైరవద్వీపం సినిమా లో రాజకుమారిగా రోజా చాలా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. భైరవద్వీపం కంటే ముందుగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు ఎటువంటి గుర్తింపు లభించలేదు. ఈ సినిమా తర్వాతనే రోజా తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణ తోనే కలిసే గాండీవం బొబ్బిలి సింహం చిత్రాల్లో నటించగా... అవి ఘన విజయాలు సాధించాయి. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళిద్దరు హిట్ పెయిర్ గా నిలిచారు. 

 


వీళ్ళిద్దరి కాంబినేషన్ లో... మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా సుల్తాన్ చిత్రంగా బాలకృష్ణ 8 పాత్రల్లో నటించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుత జనరేషన్ లో జానపద పౌరాణిక తదితర జోనర్ల లో కలిసి నటించిన ఏకైక జంట గా బాలకృష్ణ, రోజా రికార్డుకెక్కరంటే అతిశయోక్తి కాదు. రోజా బాలయ్యతో కలిసి ఏకంగా ఏడు సినిమాలలో నటించింది. పరమవీరచక్ర సినిమా లో వీళ్లిద్దరు నటించినప్పటికీ... రోజా బాలయ్య కి జంటగా నటించలేదు. 

 


తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రోజా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. అప్పటిదాకా బాలకృష్ణ కూడా ఆమెకు రాజకీయపరంగా సాయం చేసేవాడని చెబుతుంటారు. 2014 వ సంవత్సరం లో బాలకృష్ణ, రోజా ఎమ్మెల్యేలు గా ఎంపిక అయ్యారు. ఏది ఏమైనా బాలయ్య బాబు, రోజా సెల్వమణిల కాంబినేషన్ ఒక డిఫరెంట్ స్టైల్ లో ఉండేది. వారిద్దరూ వెండితెరపై కనిపించగానే అభిమానులు థియేటర్లలో ఈలలు వేస్తూ నానరభసా చేసేవారు. ఒకవేళ మళ్ళీ వీళ్ల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే అభిమానులు ఆ సినిమాని చూసేందుకు విపరీతమైన ఆసక్తిని చూపిస్తారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: