ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి సీనియర్ హీరోలు అతి పెద్ద స్టార్స్ గా వెలుగొందుతున్న సమయంలో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయప్రద, మెల్లగా ఒక్కో సినిమాతో మంచి పేరు గడిస్తూ ముందుకు సాగారు. ఇక ముందుగా 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా తొలిసారిగా నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన జయప్రద, ఆ తర్వాత నుండి హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక తన కెరీర్లో వచ్చిన ఒక్కో సినిమాతో హీరోయిన్ గా తన అందం, అభినయంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగిన జయప్రద, సహజమైన సౌందర్యానికి పెట్టింది పేరు అనే చెప్పాలి. అప్పట్లో న్యాచురల్ బ్యూటీగా ఎంతోమంది అభిమానులు జయప్రదను ఆరాధిస్తూ ఉండేవారు. 

 

ఇక ఆమె సినిమాల్లో పెద్దగా మేకప్ అవసరం ఉండదని, అలానే అందంతో పాటు అంతే అందమైన నటన కూడా జయప్రద కనబరిచి ప్రేక్షకులను రంజింప చేసే వారిని ఇప్పటికీ సీనియర్ విశ్లేషకులు కొందరు చెబుతూ ఉంటారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ  జయప్రద జోడి కి మాస్, యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇక ఆ తర్వాత తరం హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, యువసామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ల సినిమాల్లో అక్కడక్కడ కొన్ని పాత్రల్లో నటించిన జయప్రద, ఆపై రాజకీయాల్లో చేరి పూర్తిగా ఆ రంగంలోనే ముందుకు నడిచారు. 

 

ఇటీవల అక్కడక్కడా కొన్ని సినిమాలు చేస్తూ కొనసాగుతున్న జయప్రద, ఇప్పటికీ కూడా అదేవిధమైన వన్నెతరగని సహజమైన సౌందర్యంతో ఉండటం జరిగింది. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకట్టుకునే సహజసిద్ధమైన అందం, అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ నటి జయప్రదకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ కూడా మంచి క్రేజ్ నెలకొని ఉంది అనే చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: