ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అవుతుందో లేదో తెలియకపోతే ఆ ఫీలింగ్ ఒకలా ఉంటుంది. అంతేకానీ సినిమా ఓకే అయ్యి, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో  తెలియకపోతే డైరెక్టర్ కు చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ క్లిష్ట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పెండింగ్ ప్రాజెక్ట్ ను క్లియర్ చేయలేక సతమతమవుతున్నాడు. 

 

బంగార్రాజుని పట్టాలెక్కించడానికి నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు కళ్యాణ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయనా టైమ్ లో బంగార్రాజుని ఎనౌన్స్ చేసిన కళ్యాణ్ కృష్ణ ఇప్పటికీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోతున్నాడు. ఒకసారి స్టోరీ సెట్ కాలేదని మరోసారి మరో కారణంతో వాయిదా పడుతోన్న ఈ ప్రాజెక్ట్ ను లాక్ డౌన్ మరింత వెనక్కి నెట్టింది. 

 

నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బంగార్రాజుని స్టార్ట్ చేయాలనుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. అయితే లాక్ డౌన్ తో వైల్డ్ డాగ్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. సో లాక్ డౌన్ ముగిసిన తర్వాత నాగ్ మళ్లీ వైల్డ్ డాగ్ సెట్స్ లోనే అడుగుపెడతాడు. దీంతో బంగార్రాజు మరికొన్నాళ్ల పాటు వెనక్కి వెళ్లే అవకాశముంది. 

 

కళ్యాణ్ కృష్ణ బంగార్రాజుపైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు. రవితేజతో తీసిన నేలటిక్కెట్టు డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో బంగార్రాజుతో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాలనుకున్నాడు. మరో ప్రాజెక్ట్ వైపు వెళ్లకుండా ఈ సినిమాకే ఫిక్సయ్యాడు. కానీ ఈ లాక్ డౌన్ తో కళ్యాణ కృష్ణ ఆశలు కూడా వాయిదా పడుతున్నాయి. మరి నాలుగేళ్లుగా సాగుతోన్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. 

 

కళ్యాణ కృష్ణ ఏకాగ్రతంతా బంగార్రాజుపైనే ఉంది. అది చేసిన తర్వాతే ఏదైనా ఉంది అనుకుంటున్నాడు. ఎలాగైనా దాన్ని కంప్లీట్ చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: