ఆగష్టులో రాబోతున్న చిరంజీవి పుట్టినరోజు నాటికి అతడికి 65 సంవత్సరాలు వస్తాయి. అయితే ఏవిషయంలోనూ ఎలాంటి సమస్య ఎదుర్కొనడంలోను వెనకడుగు వేయకుండా తాను పరుగులు తీస్తూ అందర్నీ పరుగులు తీయిస్తున్న చిరంజీవి ప్రస్తుతం తెలుగుఫిలిం ఇండస్ట్రీలో పెద్దన్న పాత్రను చాల హుందాగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. 


కరోనా సమస్యలు మొదలుకాగానే ఇండస్ట్రీలో అందరికంటే ముందుగానే తన ‘ఆచార్య’ షూటింగ్ నిలుపుదల చేసి మిగతా సినిమాలు కూడ ఆగిపోయేలా ఒక రోల్ మోడల్ సెట్ చేసాడు. అదేవిధంగా లాక్ డౌన్ పరిస్థితులలో ఇండస్ట్రీ కార్మీకుల పరిస్థితి అద్వానంగా తయారైన పరిస్థితులలో ఇండస్ట్రీ పెద్దలు అందర్నీ ఏకం చేసి కరోనా క్రైసెస్ ఫండ్ ను ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న నటీనటులు కార్మీకుల ఆకలితీర్చి వారి హృదయాలలో కూడ స్థానం సంపాదించు కున్నాడు. 


ఇప్పుడు షూటింగ్ లు ఆగిపోవడంతో అయోమయంలో పడిపోయిన ఇండస్ట్రీ వర్గాలకు దిశా నిర్దేశ్యం చేస్తూ వచ్చే నెల నుండి సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యేలా అనేక రాయబారాలు తమ పలుకుబడి ఉపయోగించే చిరంజీవి చక్రం తిప్పాడు. ఇప్పుడు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి షూటింగ్ లు మొదలైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లు నిర్వహించడం సాధ్యమేనా అన్నచర్చలు జరుగుతున్న పరిస్థితులలో మరో షాకింగ్ నిర్ణయం వైపు చిరంజీవి అడుగులు వేస్తున్నాడు. 


ప్రస్తుతం ఇండస్ట్రీ సీనియర్ హీరోలు అయిన నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ షూటింగ్ ల ప్రారంభం విషయంలో కరోనా సమస్యలు వల్ల మరికొంత సమయం తమ వయసు రీత్యా ఆచితూచి వ్యవహరించాలి అని ఆలోచనలు చేస్తుంటే చిరంజీవి మాత్రం తన ‘ఆచార్య’ షూటింగ్ ను వచ్చేనెల నుండి మొదలుపెట్టమని కొరటాల శివకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్. అంతేకాదు కరోనా సమస్య గురించి విపరీతంగా ఆలోచనలు చేస్తూ భయపడుతున్నకొద్ది ఆసమస్య మరింత భయపెడుతుందని అందువల్ల తెలివిగా ధైర్యంగా కరోనా ను తప్పించుకుని పనులు మొదలుపెట్టాలిగాని ఆ సమస్య గురించి ఆలోచనలు చేస్తూ కాలం గడుపుతున్న కొద్ది రోజులు గడిచిపోతాయి కాని పరిస్థితులు మారవు అన్న అభిప్రాయంతో సీనియర్ హీరోలలో అందరికంటే ముందుగా తన ‘ఆచార్య’ షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టి ఇండస్ట్రీలో మరొకసారి ఒక రోల్ మోడల్ గా కొనసాగాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: