లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లు లేకపోవడంతో చిరంజీవి నుండి మిడిల్ రేంజ్ హీరోల వరకు ఈఖాళీ సమయాన్ని వినియోగించుకుంటూ సోషల్ మీడియాలో తమతమ స్థాయిలో సందడి చేసారు. తాము నటిస్తున్న సినిమాలకు సంబంధించిన స్టిల్స్ ను వీడియోలను తమ అభిమానులకు షేర్ చేస్తూ అభిమానులతో తమ సాన్నిహిత్యాన్ని కొనసాగించారు.
మహేష్ అల్లు అర్జున్ లాంటి హీరోలైతే ఏకంగా వారి పిల్లలు చేసే సందడికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వారి పిల్లలను కూడ సెలెబ్రెటీలుగా మార్చేసారు. అయితే స్వతహాగా ముభావంగా ఉండే ప్రభాస్ ఈ లాక్ డౌన్ సమయాన్ని కూడ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. వాస్తవానికి ఈఖాళీ సమయంలో ప్రభాస్ ఏమి చేస్తున్నాడో కూడ అతడి వీరాభిమానులకు కూడ తెలియనిపరిస్థితి.
ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య బాలకృష్ణ పుట్టినరోజునాడు బోయపాటి విడుదల చేసిన బాలయ్య లేటెస్ట్ మూవీ టీజర్ ను చూసి ప్రభాస్ అభిమానులకు చాల అసహనం కలిగినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఒకేఒక్క షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలయ్య సినిమాకు సంబంధించిన టీజర్ ను వదిలి సందడి చేస్తే ప్రభాస్ దిల్ రాథా కృష్ణల మూవీకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా కనీసం ఆసినిమాకు సంబంధించిన ఒక్క స్టిల్ కూడ ఎందుకు బయటకు రావడం లేదు అంటూ ప్రభాస్ అభిమానులు అసహనానికి లోనై ఒక దశలో "బ్యాన్ యూవీ క్రియేషన్స్" అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈవిషయాలు ప్రభాస్ పట్టించుకోకపోవడానికి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేయకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఈ సినిమా మొదలై చాల కాలం అయినా ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ కూడ రాలేదని ఈ సినిమాకు సంబంధించి కనీసం శాటిలైట్ డిజిటల్ డీల్స్ కూడా పూర్తవ్వలేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘సాహో’ సినిమాకు సంబంధించి కూడ శాటిలైట్ బిజినెస్ కు పెద్దగా ఆఫర్స్ లేకపోతే అతి కష్టమ్మీద జీ తెలుగు ఛానల్ కు అమ్ముకున్నారు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. అదేవిధంగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ సంబంధించి బ్యాలెన్స్ షూట్ ప్రస్తుత కరోనా పరిస్థితుల రీత్యా క్లారిటీ లేకపోవడంతో ఈమూవీ ఈ సంవత్సరం విడుదల అవుతుందా లేదా అన్నవిషయం ప్రభాస్ కు కూడ తెలియని పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన స్టిల్ ను బయటకు లీక్ చేయకుండా ప్రభాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మరికొందరు అంటున్నారు ఏది ఎలా ఉన్నా ప్రభాస్ కష్టాలు అభిమానులకు అర్ధం కావడం లేదు అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి