కరోనా పరిస్థితులను కూడ ఎదిరిస్తూ ఎదో విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్న రాజమౌళికి బండ్ల గణేష్ కు కరోనా రావడం పరోక్షంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సమస్యలు తెచ్చి పెడుతుందా అంటూ ఇందాస్త్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ కు కరోనా సోకింది అని వార్తలు రావడంతో ఇండస్ట్రీ వర్గాలు అంతా ఒక్కసారి షాక్ లోకి వెళ్లి పోయారు.

 

వస్తవానికి ఈ న్యూస్ బయటకు రాకుండా కట్టడిచేయాలని గణేష్ ప్రయత్నించినా ఈ న్యూస్ ఇండస్ట్రీ అంతా దావలనంలా వ్యాపించడంతో ఇండస్ట్రీ అంతా అలర్ట్ అయింది అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య బండ్ల గణేష్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామందిని కలసినట్లు తెలియడంతో గత కొద్దిరోజులుగా ఈసంచలన నిర్మాత ఎవరు ఎవర్ని కలిసారు అన్న కోణంలో ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. బండ్ల గణేష్ ఉండే వీధిలోనే నాగశౌర్య కూడా  ఉండటంతో ఆయనకు కూడా కరోనా భయాలు ఏర్పడి టెస్టులు చేయించుకుంటున్నట్లు టాక్.  

 

తెలుస్తున్న సమా చారం మేరకు గణేష్ ఈ మధ్య హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్ళగా  అక్కడ గణేష్ కు అనారోగ్య లక్షణాలు బయటపడటంతో డాక్టర్లు కరోనా టెస్ట్‌కు రిఫర్ చేసారు అని తెలుస్తోంది. ఇప్పటివరకు షూటింగ్ లకు అనుమతులు వచ్చినా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మహేష్ అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలు ఇప్పట్లో షూటింగ్ లు వద్దు అని తమ నిర్మాతలకు స్పష్టంగా చెపుతూ వచ్చారు. అయితే రాజమౌళి ఒత్తిడి రీత్యాయ జూనియర్ చరణ్ లు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు మానసికంగా రెడీ అవుతున్నారు.

 

ఇప్పుడు బండ్ల గణేష్ అనారోగ్యం బయట పడటంతో రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ విషయంలో పునరాలోచన చేసే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయాలతో పాటు జూనియర్ చరణ్ లు ప్రస్తుత పరిస్థితులలో రాజమౌళికి సహకరిస్తారు అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనితో ఇండస్ట్రీలో ఇప్పటిలో షూటింగ్ లు మొదలు అయ్యే  ఆస్కారం లేదు అనివార్తలు వస్తున్న పరిస్థితులలో ఇప్పటికే నిర్మాణం ప్రారంభం అయి మధ్యలో ఆగిపోయిన పెద్ద సినిమాలు నుండి చిన్న సినిమాల వరకు వాటి సంఖ్య 40 వరకు ఉండటంతో నిర్మాతల పరిస్థితి ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: