టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఎన్నో ఆశలు పెట్టుకొని జాను సినిమాని నిర్మించారు. అక్కినేని సమంత, శర్వానంద్ జంటగా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 96 కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు. మజిలీ, ఓ బేబీ సినిమాల తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న సమంత అలాగే వరస ఫ్లాపులతో సతమతమవుతూ సక్సస్ కోసం ఎదురుచూస్తూ జాను మీద నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు, శర్వానంద్ ల కి నిరాశ తప్పలేదు. ఇక లాభాలు వస్తాయనుకున్న నిర్మాత దిల్ రాజు కి కూడా ఈ సినిమా ఊహించని విధంగా షాకిచ్చింది. 

 

IHG

 

ఇక 2020 సంక్రాంతి బరిలో దిగిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో దిల్ రాజు నిర్మాతగా కొంత వరకు కష్టాల నుంచి బయటపడి రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒక సినిమా నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్స్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి కాగా మరొక సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్. అయితే కరోనా కారణంగా ఈ రెండు సినిమాలు రిలీజ్ ఎప్పుడవుతాయో తెలియని పరిస్థితి. 

 

IHG's Vakeel Saab moved for Dasara?

 

IHG's shocking and intense first-look from 'V' | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

 

అయినా రిస్క్ చేస్తూ బాలీవుడ్ లో దిల్ రాజు రెండు సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యారు. తెలుగులో నాని, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా అల్లు అరవింద్, అమన్ గిల్ లతో కలిసి దిల్ రాజు హిందీలో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు.  

 

IHG

 

ఇక విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారని అధికారకంగా దిల్ రాజు, కుల్దీప్ రాథోర్ వెల్లడించారు. బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను నే హిందీలో కూడా తెరకెక్కించనున్నాడు.

 

IHG's HIT <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HINDI' target='_blank' title='hindi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hindi</a> ...

 

అయితే ప్రస్తుతం కరోనాతో నెలకొన్న పరిస్థితులు తెలిసి కూడా దిల్ రాజు తెలుగు తో పాటు హిందీలో సినిమాలని నిర్మిస్తూ పెద్ద రిస్క్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో సినిమాలు నిర్మించాలన్న ప్లాన్ కరెక్ట్ కాదేమోనన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: