ప్రభాస్ ముఖంలో రోజురోజుకు గ్లో తగ్గిపోవడం చూసి అతడి అభిమానులు ఆందోళన పదితున్నారు అంటూ ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన కథనం ప్రభాస్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది. అంతేకాదు ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయిని పొందిన ప్రభాస్ తన లుక్ పై శ్రద్ధ పెట్టకపోతే రానున్న రోజులలో ప్రభాస్ కు కెరియర్ పరంగా కూడా నష్టం జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొందరు కామెంట్స్ చేసుకుంటున్నారని ఆ ఛానల్ కామెంట్స్ చేసింది.
అంతేకాదు వయసు రీత్యా ప్రభాస్ కన్నా మహేష్ 4 సంవత్సరాల పెద్దవాడు అయినప్పటికీ మహేష్ లుక్ లో గ్లో రోజురోజుకు పెరిగిపోతుంటే ప్రభాస్ లుక్ రోజురోజుకు అతడి అభిమానులు కూడ ఆందోళన పడే విధంగా మారుతోంది అని ఆ ఛానల్ తన కథనంలో అభిప్రాయ పడింది. అంతేకాదు ప్రభాస్ ప్రస్తుతం ఎవరు చెప్పేవారు లేక అలా మారిపోతున్నాడని 40 సంవత్సరాలు వయసు వచ్చినా ప్రభాస్ పెళ్ళి మాట ఎత్తక పోవడంతో ప్రభాస్ పెళ్ళి చేసుకుంటే కాని అతడికి ముఖంలో గ్లో రాదు అంటూ ఆ ఛానల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలకు దారితీస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఛానల్ ఈమధ్య విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుక్ ను ఆధారంగా చేసుకుని చేసిన విషయాలే అయినప్పటికీ ప్రభాస్ మహేష్ ల లుక్ ల మధ్య తేడాను స్పష్టంగా చూపెడుతూ చేసిన కామెంట్స్ మటుకు ఒక విధంగా ప్రభాస్ అభిమానులకు మింగు పడని విషయం. ప్రభాస్ ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఛానల్ అలాంటి కామెంట్స్ చేసింది అని భావించినా ప్రభాస్ ముఖంలో గ్లో తగ్గుతున్న విషయం అతడి అభిమానులు కూడ అంగీకరిస్తున్నారు.
ఇలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా ప్రభాస్ మ్యానియా మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి విపరీతంగా కొనసాగుతూనే ఉంది. అయితే ‘సాహో’ ఫస్ట్ లుక్ కు వచ్చిన స్థాయిలో బాలీవుడ్ లో ‘రాథే శ్యామ్’ ఫస్ట్ లుక్ కు స్పందన తక్కువగా రావడంతో ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కి బీటలు పడుతున్నాయా అని అనిపించడం సహజం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి