కారోనా మహమ్మారీ విలయ తాండవం పీక్ కు చేరుకోవడంతో పాటు  ముంబై హైదరాబాద్ కంటే హైదరాబాద్ లో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో భాగ్యనగరం పేరు చేపెతే అందరు ఉలిక్కి పాటుకు గురి అవుతున్నారు. ఇలాంటి స్థితిలో షూటింగులకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.  


దీనితో షూటింగ్ లు ఎక్కడికి ఆక్కడ ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడ  షూటింగులకు రాలేమని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అయితే అనేక కంపెనీలతో సెలిబ్రెటీలు కరోనా సమయం కంటే ముందుగా కుదుర్చుకున్న ఉప్పందాల వల్ల వారంతా యాడ్ షూటింగ్ లకు రావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  


ముఖ్యంగా ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్స్ కు ఈ సమస్య హెచ్చుగా ఉంటోంది. దీనితో పలువురు కథానాయికలు భయపడుతూనే యాడ్ షూటింగ్ ల నిమ్మిత్తం సెట్స్ కి వస్తున్నారట. వాణిజ్య ప్రకటనలే కాబట్టి వేగంగా నాలుగైదు రోజుల్లోనే షూట్లు పూర్తి చేసుకుని వెళ్లిపోవాలన్నది వారి ఆలోచన.  ఈ లిస్టులో  శ్రుతిహాసన్ ప్రియమణి రకుల్ ప్రీత్ తమన్నా కాజల్ వంటి హీరోయిన్స్ కు హైదరాబాద్ లో జరుగుతున్న యాడ్ షూట్స్ కి  రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
 

అయితే ఈ విషయంలో కాజల్ కి ఆమె తండ్రి నుంచి కొన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయట. కాజల్ షూటింగులకు వెళతానంటే ఆమె తండ్రి వద్దని కట్టడి చేస్తున్నట్లు టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్ సహా పలుచోట్ల పక్కా శానిటైజేషన్ తో మేకప్ రూమ్ లు బాత్రూమ్ లు వంటివి ఆర్టిస్టులకు అందుబాటులో  ఉన్నప్పటికీ షూటింగ్ లకు కాజల్ ను షూటింగ్ పంపే విషయంలో విషయంలో నో చెపుతున్నట్లు టాక్.  దీనితో ప్రస్తుతం కాజల్ తనతండ్రి మాటలు కాదనలేక యాడ్ షూటింగ్ నిర్వాహకుల నుండి వచ్చే ఒత్తిడికి సమాధానం చెప్పలేక కాజల్ ప్రస్తుతం అష్టదిగ్భంధంలో ఉంది అన్న వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: