మనలో ఉన్న టాలెంట్ ను జస్ట్ వీడియో తీసి పెడితే చాలు అది ఎక్కడికి వెళ్ళాలో.. ఎవరిని ఇంప్రెస్ చేయాలో చేసేస్తుంది. ఈమధ్య స్టార్ సినిమాల్లో ఫైట్ సీన్స్ రీ క్రియేషన్స్ ట్రెండ్ గా మారింది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఇంటర్వల్ ఫైట్ ను తీసి శభాష్ అనిపించారు కుర్రాళ్ళు. ఆ సినిమా డైరక్టర్ అనీల్ రావిపుడి సైతం అవాక్కయ్యేలా ఆ సీన్ రీ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో స్టైలిష్ ఫైట్ సీన్ ను రీ క్రియేట్ చేశారు మరో టాలెంట్ గ్యాంగ్.
అల వైకుంఠపురములో సినిమాలో చున్నీతో ఫైట్ సీన్ అదిరిపోతుంది. ఆ సీన్ ను యాజిటీజ్ దించేశారు కుర్రాళ్ళు. సినిమాలు యువకుల మీఅ.. కురాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో ఇవి చూస్తేనే అర్ధమవుతుంది. అయితే చేసేది కుర్రాళ్ళే అయినా దీని వెనుక కొందరి టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఉన్న సినీ మేకర్స్ క్రియేటివిటీ ఉందని తెలుస్తుంది. సెల్ ఫోన్ తో షూట్ చేస్తేనే ఈ రేంజ్ లో తీశారంటే ఇక వీరికి సినిమా ఛాన్స్ ఇస్తే అదరగొట్టేస్తారు. అల వైకుంఠపురములో ఈ చున్నీ ఫైట్ సీన్ వీడియో చూసి కుమ్మేశారు అంటూ థమన్ రెస్పాండ్ అయ్యాడు. అంతేకాదు ఇప్పుడే అల వైకుంఠపురములో టీం మొత్తానికి ఇది పంపిస్తున్నా అని ట్వీట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి