అవునూ..
షారుఖ్ ఖాన్,
కాజోల్ జంటగా నటించిన "దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె"
సినిమా మళ్ళీ రిలీజ్ కానుంది. అయితే అది మన దేశంలో కాదు. అయితే ఈ
సినిమా ఏ ఏ దేశాలలో రిలీజ్ కానుంది? ఎపుడు రిలీజ్ కానుంది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
.jpeg)
ఇక అసలు వివరాల్లోకి వెళితే..
షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం "దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగె"
సినిమా విడుదలై పాతికేళ్లవుతుంది.
ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించాడు. యష్ చోప్రా నిర్మించాడు. అప్పట్లో ఈ చిత్రం ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. సినిమాలోని పాటలు ఇప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ముంబైలో ఓ థియేటర్‌లో ఎక్కువ రోజులు రన్ అయిన సినిమాగా కూడా ఈ
సినిమా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇటీవల
అమీర్ ఖాన్ సైతం ఈ సినిమాపై స్పందిస్తూ.. "తన మనస్సాక్షిని కనుగొనే ఓ
హీరో, తన గొంతు (స్వేచ్ఛ)ను కొనుగొనే ఓ హీరోయిన్, మనసు మారిన ఓ విలన్, మనందరిలో ఉండే దయాగుణం, మంచితనం, ఉన్నత స్వభావాలను "డీడీఎల్‌జే" ప్రదర్శించింది. 25 సంవత్సరాలుగా ఆ
సినిమా ప్రపంచాన్ని మైమరపిస్తూనే ఉంది" అని చెప్పుకొచ్చాడు.
.jpeg)
ఇదిలా ఉంటే.. ఈ
సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్
మీడియా లో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ
సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారట. అది కూడా ఒకటి.. రెండు దేశాల్లో కాదు.. ఏకంగా 18 దేశాల్లో. అవునూ.. అవేంటంటే.. యు.కె, యు.ఎస్,
జర్మనీ,
ఆస్ట్రేలియా,
సౌదీ అరేబియా,
సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఫిజి, స్పెయిన్, స్పీడన్,
ఎస్టోనియా, ఫిన్‌లాండ్,
కెనడా,
జర్మనీ దేశాల్లో ఈ
సినిమా రీ రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాల్సి ఉంది. చుడాలి మరి ఈ
సినిమా ఇక్కడ క్రియేట్ చేసిన రికార్డులు అక్కడ కూడా క్రియేట్ చేస్తుందో.. లేదో..