బాహుబలి రెండు భాగాల సినిమాలతో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తులో  హీరోగా భారీ స్థాయిలో మార్కెట్ వాల్యూ దక్కించుకున్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్ పై ప్రసాద్ దేవినేని శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలు రెండు కూడా ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత విజయాలను అందుకుని దేశవిదేశాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని, వైభవాన్ని విస్తరింపజేసి వందల కోట్ల రూపాయల కలెక్షన్ ని అందుకున్నాయి. ఈ సినిమాల అనంతరం సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్.
అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన సక్సెస్ ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీకి యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటలీలో జరుగుతోంది. దీని తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్ అనే ప్రతిష్టాత్మక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులందరూ కథలు సిద్ధం చేసుకుని ఎప్పటికప్పుడు ఆయన్ని కలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ తో ఒక భారీ సినిమాని తెరకెక్కిస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను, త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఒక అద్భుతమైన పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని, ప్రభాస్ కు మాత్రమే సెట్ అయ్యే ఆ కథలో లవ్, యాక్షన్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కూడా కలగలిపి దర్శకుడు బోయపాటి ఆ స్క్రిప్ట్ ని ఎంతో పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. అతి త్వరలో దానిని ప్రభాస్ కి వినిపించి ఆయన ఆమోదం కూడా అందుకోనున్నాడని టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ అతి త్వరలో దీనిని నిర్మచనుందని అంటున్నారు. ప్రభాస్ కూడా ప్రస్తుతం తన కమిట్మెంట్స్ అనంతరం బోయపాటి సినిమాను కూడా చేసేందుకు సుముఖత చూపుతున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే అతి త్వరలో ప్రభాస్ మరియు బోయపాటి ల కలయిక లో ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చూడవచ్చన్న మాట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: