ఈమధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ ద్వారా వివిధ ప్రొడక్ట్స్ ను జనానికి పరిచయం చేస్తూ ఆ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా కేవలం ఇంట్లో కూర్చుని కోట్లు గణిస్తోంది అంటూ కామెంట్స్ కూడ వస్తున్నాయి. దీనికితోడు నాగార్జున షూటింగ్ లో బిజీగా ఉండటంతో అతడి స్థానంలో సమంత బిగ్ బాస్ షోను  హోస్ట్ గా రావడంతో వచ్చే ఏడాది సీజన్ కు సమంత ‘బిగ్ బాస్ సీజన్ 5’ నాగార్జున స్థానంలో హోస్ట్ చేస్తుందా అంటూ కొందరు కామెంట్స్ కూడ చేసారు.


ఇది ఇలా ఉంటే ఈమధ్య సమంత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లి వి ఎప్పుడు కాబోతున్నావు అని అడిగిన ప్రశ్నకు ఒక షాకింగ్ సమాధానం ఇచ్చింది. తాను నాగచైతన్య ఇంకా పిల్లలమని అప్పుడే తమకు పిల్లలు ఏమిటి అంటూ జోక్ చేసింది. ఈ జోక్ ను విన్నవారు మాత్రం సమంత పేల్చిన ఈ జోక్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల జోక్ ను కాపీ కొట్టింది అంటు సెటైర్లు వేస్తున్నారు.  




రామ్ చరణ్ ఉపాసన లు ఇటీవలే తమ 8వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. చిరంజీవి అడుగుజాడల్లో హీరోగా టాలీవుడ్‌ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రి తగ్గ తనయుడుగా రాణిస్తున్నాడు. అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన ను 5 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిగింది.


చరణ్ ఉపాసన లకు పెళ్లై ఎనిమిదేళ్లు అవుతున్న వీరిద్దరికి పిల్లలు లేరు. ఈ విషయమై టాలీవుడ్‌ లో ఇప్పటికీ చాలా మంది తరుచూ మెగా వారసుడు ఎప్పుడు అంటూ చిరంజీవిని చరణ్ ను అడుగుతూ ఉంటారు. దీనికి చరణ్ నవ్వుతూ తాము ఇంకా పిల్లలమే అనీ తాము తల్లితండ్రులు అవ్వడానికి ఇంకా మానసికంగా సిద్ధపడలేదు అంటూ సమాధానాన్ని దాటవేస్తాడు. ఇప్పుడు అదే సమాధానాన్ని సమంత రిపీట్ చేయడంతో చరణ్ ను ఆదర్శంగా తీసుకుని చైతూ సమంతలు అడుగులు వేస్తున్నారా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: