నాగ చైతన్య తో ‘జోష్’ , ఎన్టీఆర్ తో ‘దమ్ము’ చిత్రాలు చేసి అందాలు ఆరబోసిన ఒక నాటి అందాల తార రాధ కూతురు కార్తీక తాజాగా చెల్లెలి పాత్రకు కమిట్ అయి అందరినీ షాక్ కు గురి చేసింది. అదికుడా అల్లరి నరేష్ నటించే ఒక కామెడీ సినిమాలో చెల్లి పాత్ర అని వార్తలు రావడం అందరికీ షాకింగ్ గా మారింది.
‘వీడు తేడా’ అనే సినిమా తీసిన దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో అమ్మిరాజు అనే నిర్మాత నిర్మిస్తున్న సినిమాలో కార్తిక చెల్లెలి పాత్ర పోషించడానికి ఎంపిక అయిందని టాక్. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఒకప్పుడు కామెడీ చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ హీరో గా ఉండే అల్లరి నరేష్ సినిమాలు అంటే బయ్యర్లు కళ్ళు మూసుకుని కొనేవారు. అయితే ఇప్పుడు ఇదే హీరో చిత్రాలు అంటే భయపడి పారిపోతున్నారని ఫిల్మ్నగర్ టాక్ దీనికి కారణం నరేష్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం కారణంగా చెప్తున్నారు. జంప్ జిలాని సైతం నిరాశపరచటంతో పూర్తిగా నరేష్ పై బయ్యర్లకు నరేష్ పై పూర్తి గా హోప్స్ పోయాయని అంటున్నారు.
అయితే ఇది అంతా అల్లరోడి స్వయం కృతాపరాధమే అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి. నరేష్ సినిమాలకు ఈ మధ్యకాలంలో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ‘సుడిగాడు’ వచ్చిన తర్వాత 12 కోట్లు దాకా నరేష్ సినిమాలకు బడ్జెట్ పెరిగి పోవడంతో ఆ స్థాయిలో కలెక్షన్స్ లేక రికవరీ కష్టమైపోతోంది అని ఫిలిం నగర్ విశ్లేషకులు అంటున్నారు. దీనికితోడు నరేష్ ఈ మధ్యన చేసేవన్నీ రొటీన్ కామెడీతో ఒకే తరహా జోకులతో, ప్యారెడీలతోసినిమాలు చేస్తూ ఉండటం తో సుడిగాడి తరహా సినిమాల పై ప్రేక్షకులకు మోజు పోయింది అని అంటున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ గా రాణిద్దాం అనుకున్న కార్తిక ఇలా అల్లరోడి చెల్లలుగా మారింది అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి