కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవర్ఫుల్ కథను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అయింది. ఇక దీని అనంతరం మిగిలి ఉన్న షూటింగ్ పూర్తవ్వగానే సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలు ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వచ్చే ఏడాది వేసవి తర్వాత రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ అలానే ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించి వచ్చే రెండు భారీ యాక్షన్ సన్నివేశాలు రేపు థియేటర్లో ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకునేలా చేస్తాయట.
వాటిలో ఎన్టీఆర్ చేసే అత్యంత భీకరమైన పులి ఫైట్ ఒకటైతే పోలీస్ స్టేషన్ పై జరిగే దాడి ఘటనలో రాంచరణ్ చేసే భీకర పోరాట సన్నివేశాలు రెండూ కూడా సినిమాలో అత్యద్భుతంగా వచ్చాయని రేపు రిలీజ్ తర్వాత ఈ రెండు సన్నివేశాల గురించి దేశ విదేశాల్లోని ప్రేక్షకులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అని అంటున్నారు. ఇప్పటికే ఈ రెండు సీన్స్ ని అదరగొట్టిన రాజమౌళి వీటితోపాటు సినిమాని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా అటు నందమూరి ఇటు మెగా ఫ్యాన్స్ ఇద్దరికీ కూడా అతిపెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి