బాహుబలి..ఈ
సినిమా మన భారత దేశ
సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది.,
రాజమౌళి సృష్టించిన ఈ కళాఖండం ఒక్క తెలుగు, లేదంటే
ఇండియా లోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఒక అద్భుతంగా నిలిచింది. ఇక ఇంటర్నేషనల్
మీడియా సైతం
బాహుబలి పై ఎన్నో ప్రశంసలను కురిపించింది. ప్రపంచం మొత్తం మన తెలుగు
సినిమా చూసేలా చేయాడం లో నూటికి నూరు పాళ్ళు
జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాను రెండు విభాగాలుగా తీయగా ఒకదానితో మరొకటి పోటీ పడి హిట్ అయ్యాయి.
ప్రభాస్ క్రేజ్ ఒక రేంజ్ లో మార్చేసిన ఈ
సినిమా లో ఈ ఒక్కటి బాగుంది అంటూ చెప్పే అవసరం లేకుండా అన్ని విభాగాలు అదరహో అనిపించాయి. రానాకు ప్రతి నాయకుడిగా, శివగామిగా రమ్యకృష్ణకు అభిమానులు బ్రహ్మరధం పట్టారు.

కాగా అస్సలు విషయానికి వస్తే ఈ చిత్రంలో చిన్నప్పటి
ప్రభాస్ గా నటించిన బుడతడు మీకు గుర్తు ఉన్నదా..? మరి ఈ
సినిమా వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పడు ఆ చిన్నారి ఎలా ఉన్నదో తెలుసా...? నిజానికి
ప్రభాస్ చిన్ననాటి పాత్ర కోసం చాల మంది ని ఆడిషన్ చేశారట. ఏంటో మందిని పరిశీలించాక ఫైనల్ అయినా బాల నటుడి పేరు నిఖిల్ దేవాదుల.
బాహుబలి కి ముందు కూడా కొన్ని
టాలీవుడ్ సినిమాల్లో కనిపించిన
నిఖిల్ రాజమౌళి దృష్టిని ఆకర్షించాడు.. మమతల తల్లి అంటూ సాగే పాటల్లోనూ, ఫ్లాష్ బ్యాక్
ఎపిసోడ్ లోను
రమ్యకృష్ణ తో కలిసి కనిపిస్తాడు. ఈ
సినిమా లో నటించి
నిఖిల్ ఒక్కసారిగా ఎందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పడు చూడటానికి పెద్దవాడయినట్టుగా కనిపిస్తున్న ఈ నూనూగు మీసాల కుర్రోడు కొన్నాళ్లయ్యాక
హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు . అంతగా అతడి క్యూట్ లుక్స్ ఆకర్షిస్తున్నాయి. మరి చాలామంది హీరోల్లా అతడు మల్లి కనిపించాలని కోరుకుందాం