దిల్ రాజ్ 50వ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి అన్నది ఒక వార్త అయితే ఆ ఈవెంట్ లో దిల్ రాజ్ చేసిన ఉపన్యాసం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అదేవిధంగా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజ్ 50వ పుట్టినరోజు వేడుకలకు ఇండస్ట్రీలోని ప్రముఖులు టాప్ హీరోలతో సహా అందరూ హాజరు కావడంతో ఇండస్ట్రీ పై ఉన్న పట్టును సూచిస్తోంది.


అయితే ఎవరితోనైనా చాల తక్కువగా మాట్లాడే దిల్ రాజ్ తన తీరుకు భిన్నంగా ఈసారి తన పుట్టినరోజు ఫంక్షన్ లో ఎవరు ఊహించని కొన్ని ఆసక్తికర విషయాలను టచ్ చేసినట్లు తెలుస్తోంది. సొసైటీకి ఎంతోకొంత వెనక్కు ఇవ్వడం పేదవారికి సహాయం చేయడం సామాజిక సేవ లాంటి విషయాలను టచ్ చేస్తూ ఇక తన రాబోయే జీవితంలో సినిమాలతో పాటు ఈ విషయాల పై కూడ తాను ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.


దీనితో ఆ కార్యక్రమానికి హాజరైన అనేకమంది సెలెబ్రెటీలు ప్రమఖులు దిల్ రాజ్ మాటలు విని షాక్ అయినట్లు సమాచారం. ఎప్పుడు సినిమాల గురించి తప్ప మరే విషయాల గురించి మాట్లాడని దిల్ రాజ్ నోటి వెంట రాజకీయ సామాజిక స్పృహతో కూడిన మాటలు ఎందుకు వచ్చాయి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.


గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజ్ రాజకీయాలలోకి వస్తాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే ఎప్పుడు ఆ వార్తలను దిల్ రాజ్ ఖండిస్తూ వచ్చాడు. ఇప్పుడు దిల్ రాజ్ నోటివెంట ఇలాంటి మాటలు రావడంతో త్వరలోనే దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనితో దిల్ రాజ్ చూపు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ వైపు ఉందా లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు ఉందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: