చిత్ర పరిశ్రమలో  హీరోలతో పోటీగా పారితోషకం పొందే హాస్యనటులు ఉన్నారంటే నమ్మగలరా అవును నిజమే .సినిమాలో హీరో, హీరోయిన్స్ తర్వాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన పాత్ర హాస్య నటులదే. కమెడియన్స్ లేని చిత్రం అంటూ ఉండదు . సినిమా ప్రేక్షకులను నవ్వించి వారి హృదయాలను కట్టి పడేయడం అంటే మాటలు కాదు కాబట్టే హాస్యనటులకు అంత డిమాండ్, వీరు వెండితెరపై కనిపిస్తే చాలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి .అలాంటి కొందరు హాస్యనటుల గురించి తెలుసుకుందాం.

హాస్య నటుడు బ్రహ్మానందం :  హీరోలతో సమానంగా అభిమానులున్నారు. వివిధ భాషలలో 1000 పైగా సినిమాలలో నటించి, 2010 లో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. .ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు పొందారు. బ్రహ్మానందం రోజుకు ఐదు లక్షలు తీసుకుంటారు . ఒక్కొసారి ఒక సినిమాకే  రూ. కోటి వరకు పారితోషకం తీసుకుంటారు.

హాస్యనటుడు అలీ: ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్ తన మొదటి సినిమా సీతాకోక చిలుక లో తన నటనా ప్రతిభను కనబరిచాడు అప్పటినుంచి ఇప్పటివరకు వెనుదిరిగి చూడకుండా హాస్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్.   అలీ రోజుకు మూడున్నర లక్షలు పారితోషికంగా తీసుకుంటాడు.

వెన్నెల కిషోర్:  కిషోర్ మొదట సాఫ్ట్‌వేర్  ఇంజనీర్‌ ఆయనకి నటనపై ఆసక్తితో 2008 సినీ రంగ ప్రవేశం చేశాడు.  కిషోర్ డూకుడు చిత్రంలో "శాస్త్రి" పాత్రకు మంచి గుర్తింపు లభించింది. కిషోర్ హాస్యనటుడిగా గుర్తింపు లభించి రోజుకు 3 లక్షల వరకు తీసుకుంటున్నాడు.

పృథ్వీరాజ్: 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో తో పృథ్వీరాజ్ అనర్గళంగా డైలాగ్ చెప్పడంలో దిట్ట. రోజుకు రెండు లక్షల రూపాయలు పారితోషకం పొందుతూ అగ్ర హాస్య నటుల్లో ఒకరిగా ఎదిగారు.

సప్తగిరి: పరుగు సినిమాలో సైడ్ క్యారెక్టర్ తో సినీ ప్రవేశం చేసిన సప్తగిరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కూడా రోజుకు రెండు లక్షల రూపాయలు పారితోషికం పొందుతోందని సమాచారం.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి సినీ రంగ ప్రవేశం చేసిన హాస్యనటులు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని తెలుగు ప్రజల అభిమానాన్ని, ఆదరణని పొందుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: