ఇకపోతే ఈ సినిమా ద్వారా తొలిసారిగా తండ్రి మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు మెగాపవర్ స్టార్ రాంచరణ్. తిరు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు భారీ వ్యయంతో రూపొందించిన టెంపుల్ టౌన్ సెట్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దేవాదాయ శాఖలోని అక్రమాలు భూముల కుంభకోణాలపై మంచి మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులు కలగలిపి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ద్వారా చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ ని అందిస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలోని మొత్తం ఐదు సాంగ్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఇకపోతే ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు. ఐదు సాంగ్స్ వేటికవే శ్రోతలను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు స్క్రీన్ పై వీడియోస్ పరంగా కూడా ఆడియన్స్ ని అలరించడం ఖాయం అని అంటున్నారు. ఇక సినిమాకి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అని, ఆ విధంగా ఈ ప్రతిష్టాత్మక ఆచార్య సినిమాలో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయమై మెగాస్టార్ ఫ్యాన్స్ హ్యాపీ గా తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ న్యూస్ అని చెప్పకతప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి