ఇక అసలు విషయానికి వస్తే మెగా కాంపౌండ్ నుంచి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్, చాలా ఏళ్ల క్రితం అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన అఖిల్ మధ్య ఇప్పుడు ఫ్యాన్ వార్ నడుస్తోంది. ‘ఉప్పెన’కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తుండటం ఈ వార్‌కి కారణమైంది. అఖిల్ హీరోగా పరిచయం అయ్యి దాదాపు ఆరేళ్లు అయ్యింది. అయినా ఇంకా హిట్ రాలేదు. రీఎంట్రీ, రీరీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు రీరీరీ ఎంట్రీకి రెండీ అవుతున్నాడు. మరోవైపు వైష్ణవ్‌తేజ్ ‘ఉప్పెన’తో మంచి సూపర్ హిట్ కొట్టి ఆకట్టుకున్నాడని పరిశీలకులు అంటున్నారు.
ఈ విషయంలో అఖిల్ కంటే వైష్ణవ్ తేజ్ చాలా బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అఖిల్, వైష్ణవ్ తేజ్ మద్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా వైష్ణవ్ తేజ్‌దే పైచేయి అవుతుందని సోషల్ వార్ సారాంశం. అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఇప్పుడు అఖిల్ ప్లాపుల్లో వున్నా భవిష్యత్తులో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి