ఉప్పెన సినిమాతో మొదటి ప్రాజెక్ట్ తోనే తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. ఉప్పెన సినిమా చూసిన ఎవరైనా అమ్మడికి ఫిదా అవక తప్పదు. సినిమా కోసం తెలుగు కూడా బాగానే నేర్చేసుకున్న అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. నాని శ్యాం సింగ రాయ్.. సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో కృతి శెట్టి క్రేజ్ డబుల్ అవుతుందని చెప్పొచ్చు.

ఉప్పెన సినిమా రిలీజ్ హంగామా ఎలా ఉందో కృతి శెట్టి ఫాలోయింగ్ చూస్తే అర్ధమవుతుంది. ఆమె అప్పుడెప్పుడో చేసిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైఫ్ బోయ్ కోసం చేసిన కృతి శెట్టి యాడ్ రెండేళ్ల క్రితమే యూట్యూబ్ లో రిలీజ్ అవగా ఇప్పుడు ఆ యాడ్ లో ఉంది మన బేబమ్మే అని అది తెగ వైరల్ చేసేస్తున్నారు. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం అమ్మడికి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.

అంతేకాదు ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట బేబమ్మ. ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు డైరక్షన్ లోనే కృతి శెట్టి నటిస్తుందని అంటున్నారు. సో ఈ డైరక్టర్ బేబమ్మతో మరో సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. కృతి శెట్టి తో మైత్రీ మూవీ మేకర్స్ కూడా మరో రెండు సినిమాల అగ్రిమెంట్ ఏర్పరచుకున్నారని తెలుస్తుంది. తప్పకుండా కృతి శెట్టి తెలుగులో టాప్ హీరోయిన్ అవడం పక్కా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో కృతి శెట్టిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ ఒక్క సినిమా పడితే కృతి స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరినట్టే లెక్క.      
             

మరింత సమాచారం తెలుసుకోండి: