బాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం రేగిన సంగతి గెలిసిందే. ప్రముఖ హీరోయిన్ తాప్సి పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, దర్శక నిర్మాత విక్రమాదిత్య మోత్వనే , మధు మంతెన లకు సంబందించిన ఇళ్ళు మరియు ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై, పూణే, ఢిల్లీ , హైదరాబాద్ లలో మొత్తం 28 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు మొదలయ్యాయి. ఈ ఐటీ దాదులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు . అయితే ఈ మొత్తం దాడులకు ఫాంటమ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థనే కారణమని అధికారులు గుర్తించారు. ఈ ప్రొడక్షన్ సంస్థలో కోట్లలో అక్రమ లావాదేవీలు జరిగినట్టు డాక్యుమెంట్స్ దొరికాయని అధికారులు గుర్తించారు. ఇక తాజాగా ఈ దాడులపై తాప్సి పన్ను బాయ్ ఫ్రెండ్ ప్రముఖ క్రీడా కారుడు మాథియాస్ బోయ్ స్పందించారు.

ఈమేరకు మాథియాస్ సోషల్ మీడియాలో....ఈ విషయం నన్ను కొంచెం గందరగోళంలో పడేసింది . కొంతమంది గొప్ప అథ్లెట్లకు కోచ్ గా నేను మొదటిసారిగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే ఇటీవల తాప్సి ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేయడం ఆమెను ఎక్కువ వత్తిడికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆమె తల్లింతండ్రులు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నారు. మంత్రి కిరెన్ రిజిజు దయచేసి మీరు ఏదైనా చేయండి" అంటూ క్రీడా మంత్రిని టాగ్ చేసి ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక తాప్సి బాయ్ ఫ్రెండ్ ట్వీట్ పై క్రీడా మంత్రి కిరెన్ ఘాటుగా స్పందించారు. చట్టం అత్యున్నతమైనది. దానికి అందరం కట్టుబడి ఉండాలి. ఈ విషయం మీకు నాకు చెందినది కాదు  మేము మా వృత్తి పరమైన విడుదలకు కట్టుబడి ఉండాలి" అంటూ సమాధానం ఇచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: